ఐపీఎల్ సీజన్ 17లో భాగంగా.. ఈరోజు మరో మ్యాచ్ జరుగనుంది. మరికాసేపట్లో (రాత్రి 7.30) కోల్కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా.. సన్ రైజర్స్ హైదరాబాద్-కోల్కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ ఉండనుంది. ఈ క్రమంలో.. టాస్ గెలిచిన సన్ రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ సీజన్ లో సన్ రైజర్స్ కెప్టెన్ గా కమిన్స్ బరిలోకి దిగుతున్నాడు. కేకేఆర్ జట్టు తరుఫున ఫిల్ సాల్ట్, మిచెల్ స్టార్క్ అరంగేట్రం చేస్తున్నారు.

పిచ్ రిపోర్ట్
ఈడెన్ గార్డెన్స్ పిచ్ తరచుగా ఐపీఎల్ సమయంలో బౌలర్లు, బ్యాట్స్‌మెన్‌లకు సమానంగా సహాయపడుతుంది. ఫాస్ట్ బౌలర్ల కంటే స్పిన్నర్లకు ఎక్కువ ప్రభావవంతంగా ఉంటుంది. బ్యాటర్ సెట్ అయిన తర్వాత, ఈ స్టేడియంలో పెద్ద ఇన్నింగ్స్‌లు ఆడుతారు.
అందరి దృష్టి కమ్మిన్స్-స్టార్క్‌పైనే..
ఐపీఎల్ 2024 వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ. 20.50 కోట్లకు కమిన్స్‌ను కొనుగోలు చేయడం గమనార్హం. అదే వేలంలో రూ.24.75 కోట్లకు కోల్‌కతా నైట్ రైడర్స్ మిచెల్ స్టార్క్‌ను కొనుగోలు చేసింది. అందుకోసమని.. ఈ ఇద్దరు ఆటగాళ్లు తమ జట్టుకు ఎలా తోడ్పడుతారో చూడాలి.
కోల్‌కతా నైట్ రైడర్స్ ప్లేయింగ్ ఎలెవన్:
ఫిలిప్ సాల్ట్(వికెట్ కీపర్), వెంకటేష్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), నితీష్ రాణా, రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, రమణదీప్ సింగ్, మిచెల్ స్టార్క్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి.
సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయింగ్ ఎలెవన్:
మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్‌రామ్, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, మార్కో జాన్సెన్, పాట్ కమిన్స్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, టి నటరాజన్