బిపర్‌జాయ్ తుఫాను తీవ్ర ప్రభావం నైరుతీ రుతుపవనాలపై చూపించింది. వాతావరణంలో తీవ్రమైన మార్పులు రావడంతో.. రుతుపవనాల్లో చల్లదనం మాయమైంది. వాటి కదలిక కూడా నెమ్మదిగా సాగుతుంది. దీని వల్లే రుతుపవనాల వల్ల వర్షాలు కురవట్లేదు. మొత్తం అల్లకల్లోలం అయిపోయింది. ఇప్పుడు బిపర్‌జాయ్ తుఫాన్ ప్రభావం పోవడంతో.. ఇకపై రుతుపవనాల వల్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచి శ్రీ సత్యసాయి, అన్నమయ్య, జిల్లాలో తేలికపాటి, మోస్తరు వర్షాలు కురుస్తాయనీ… అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు అంచనా వేశారు. కోస్తా ఆంధ్రలో కూడా కొన్ని చోట్ల ఉరుములు, మెరుపుల వానాలు పడతాయి అని తెలిపారు. ఉత్తరాంధ్రతో పాటూ కొన్ని జిల్లాల్లో వేడిగాలులు, అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెల్లడించారు.
Read Also: Kedarnath: కేదార్‌నాథ్‌లో బంగారం కుంభకోణం.. పూజారి ఆరోపణతో కలకలం..
ప్రస్తుతం తీరానికి దగ్గర్ లో ఉపరితల ఆవర్తనం ఉంది. దీని వల్ల రాయల సీమ, కోస్తా ఆంధ్ర జిల్లాల్లో ఆకాశం కొద్దిగా మేఘాలతో నిండివుంది. అలాగనీ ఈ మేఘాలపై ఎక్కువ ఆశలు పెట్టుకోవడం దండగా.. ఎండ ఎక్కువగా వస్తే.. ఈ మేఘాలు వర్షాలను కురిపించే అవకాశం తక్కువగా ఉంటుంది.. అందువల్ల మనం అప్పుడే ఎండలు తొలగిపోతాయని అనుకోవద్దని వెదర్ డిపార్ట్మెంట్ అధికారులు అంటున్నారు. ఇక.. తెలంగాణలో కూడా నేటి నుంచి చాలా తక్కువ ప్రాంతాల్లో తేలికపాటి వర్షం జల్లులు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ విభాగం అధికారులు వెల్లడించారు. అయితే… వడగాలులు, అధిక ఉష్ణోగ్రతలు మరో 3 రోజులు కొనసాగుతాయన్నారు. ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలనీ, వీలైనంతవరకూ ఎండలో తిరగకూడదని కోరారు.
Read Also: DRDO Recruitment: నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. 181 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్..
తెలంగాణలోని కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ను భారత వాతావరణ విభాగం జారీ చేసింది.. ఖమ్మం, మంచిర్యాల, నిర్మల్, , హన్మకొండ, వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, ఆసిఫాబాద్, పెద్దపల్లి, ములుగు, సూర్యాపేట, భూపాలపల్లి, కరీంనగర్ జిల్లాలు. ఈ జిల్లాల్లో ప్రజలు వీలైనంతవరకూ ఇళ్లలోనే ఉండాలని అధికారులు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా కూడా ఎండల తీవ్రత ఎక్కువగానే నమోదవుతుంది. ఎండల తీవ్రత మరో 5 రోజులపాటూ ఇలాగే ఉంటాయి అని భారత వాతావరణ విభాగం అధికారులు అంటున్నారు.