నిరుద్యోగులకు ప్రభుత్వాలు వరుస గుడ్ న్యూస్ లను చెబుతుంది.. ఇప్పటికే గత కొన్ని రోజులుగా ప్రభుత్వం పలు శాఖల్లో ఉన్న ఖాళీలను పూర్తి చేస్తుంది.. ఈమేరకు మరో నోటిఫికేషన్ ను ప్రభుత్వం రిలీజ్ చేసింది..కేంద్ర రక్షణ శాఖ ఆధ్వర్యంలోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్, వివిధ ఉద్యోగాలను భర్తీ చేస్తోంది… ఈ నోటిఫికేషన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ఖాళీలు, పూర్తి వివరాలు..
సైంటిస్ట్-B రిక్రూట్‌మెంట్ ప్రాసెస్‌లో డీఆర్‌డీవో వివిధ విభాగాల్లో ఇంజనీరింగ్ పోస్టులను భర్తీ చేయనుంది.
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీర్- 49
మెకానికల్ ఇంజనీర్- 44
కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీర్- 34
ఎలక్ట్రికల్ ఇంజనీర్- 5
మెటీరియల్ ఇంజనీర్- 10
ఫిజిక్స్- 10
కెమిస్ట్రీ- 5
కెమికల్ ఇంజనీర్- 13
ఏరోనాటికల్ ఇంజనీర్- 7
మేథమెటిక్స్- 2
సివిల్ ఇంజనీర్- 2
జనరల్- 73, ఈడబ్ల్యూఎస్- 18, ఓబీసీ- 49, ఎస్సీ- 28, ఎస్టీ- 13..
అర్హతలు :
అర్హత ఉన్న అభ్యర్థులు సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్ లేదా మాస్టర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. గేట్ క్వాలిఫై అవ్వడం తప్పనిసరి.
వయస్సు:
గరిష్ట వయసు 28 సంవత్సరాల లోపు ఉండాలి. ఓబీసీ (నాన్ క్రిమిలేయర్) అభ్యర్థుల గరిష్ట వయసు 31, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల గరిష్ట వయసు 33 ఏళ్లలోపు ఉండాలి…
ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
ముందుగా అభ్యర్థులు rac.gov.in ఓపెన్ చేయాలి. హోమ్ పేజీలోకి వెళ్లి డీఆర్‌డీవో సైంటిస్ట్- B రిక్రూట్‌మెంట్‌పై క్లిక్ చేయాలి.
ఇప్పుడు కొత్త పేజీ ఓపెన్ అవుతుంది, అవసరమైన అన్ని వివరాలు ఎంటర్ చేసి రిజిస్టర్ అవ్వాలి. ఆ తరువాత లాగిన్ అయి అప్లికేషన్ ఫారమ్ నింపాలి.
అప్లికేషన్ ఫీజు చెల్లించి, చివరగా ఫారమ్‌ను సబ్‌మిట్ చేయాలి… జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులు రూ.100 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించనవసరం లేదు…
ఇకపోతే రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ వంటి దశలు ఉంటాయి. ఎంపికయ్యే అభ్యర్థులు మూడేళ్లపాటు ముంబైలోని ల్యాబ్ లో ఉండాలి.. ఆ తర్వాత పోస్టింగ్ వేస్తారు.. ఆసక్తి కలిగిన వారు నోటిఫికేషన్ ను చదివి అప్లై చేసుకోగలరు..