Aakash Chopra Slams Yashasvi Jaiswal Poor Form in IPL 2024: టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్.. ఐపీఎల్ 2024లో పెద్దగా రాణించడం లేదు. వరుస మ్యాచ్‌లలో విఫలమవుతున్నాడు. ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో 121 పరుగులు మాత్రమే చేశాడు. ఈ సీజన్‌లో యశస్వి అత్యధిక స్కోరు 39. ఈ సీజన్‌లో యశస్వి ఎంత బ్యాడ్ ఫామ్‌లో ఉన్నాడో దీన్ని బట్టి అర్థమవుతుంది. అతను ఓపెనర్‌గా వచ్చే అతడు ఒక్క అర్ధ సెంచరీ కూడా చేయకపోవడం విశేషం. భారీ షాట్ ఆడే ప్రయత్నంలో ప్రతిసారీ అవుట్ అవుతున్నాడు. యశస్వి ఫ్లాప్ షోపై టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాష్ చోప్రా స్పందించాడు.
ఆకాష్ చోప్రా తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ… ‘యశస్వి జైస్వాల్ గురించి నేను ఆందోళన చెందుతున్నా. అతను ప్రతి బంతిని బాదడానికే ప్రయత్నిస్తున్నాడు. ఇది అతని సహజమైన ఆట కాదు. యశస్వి చాలా మంచి ఆటగాడు. అతడు టైమింగ్ మీద దృష్టి పెట్టాలి. యశస్వి నువ్ రెజ్లర్ కాదు, ఆండ్రీ రస్సెల్ అంతకంటే కాదు. నీ ఆట చాలా భిన్నంగా ఉంది. నేను యశస్వి ఆటను ఇష్టపడతా. కానీ ఐపీఎల్ 2024లో అతడు ఆకట్టుకోవడం లేదు’ అని అన్నాడు.
Also Read: PBKS vs MI: ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్!
‘రాజస్థాన్ రాయల్స్ కోచ్ కుమార సంగక్కర యశస్వి జైస్వాల్‌తో మాట్లాడాలని నేను కోరుకుంటున్నా. లేదా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫోన్ చేసి మాట్లాడాలి. టీ20 ప్రపంచకప్ 2024 వస్తోంది. మెగా టోర్నీలో ఆడాలంటే ఈ ఫామ్ సరిపోదు. ఇప్పటికైనా జాగ్రత్తగా ఆడితే బెటర్. ఓ సిక్స్ లేదా ఓ ఫోర్ కొట్టిన వెంటనే మరో పెద్ద షాట్‌కు ప్రయత్నించి ఔట్ అవుతున్నాడు. దీనిపై చేర్చిస్తే మంచిది’ అని ఆకాష్ చోప్రా సూచించాడు. టీ20 ప్రపంచకప్ 2024 కోసం భారత జట్టును ఐపీఎల్ ఆధారంగానే ఎంపిక చేస్తారన్న విషయం తెలిసిందే. యశస్వి ఇలానే ఆడితే చోటు కష్టంగా మారుతుంది.