యూట్యూబ్ ద్వారా ప్రేక్షకులను అలరిస్తూ వచ్చిన సుహాస్ ఇప్పుడు స్టార్ హీరో అయ్యాడు.. కలర్ ఫోటో సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బాస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.. అప్పటి నుంచి వరుస హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటున్నాడు.. రీసెంట్ గా ప్రసన్న వదనం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు.. సుహాస్ నటించిన సినిమాలలో శ్రీరంగనీతులు కూడా ఒకటి. ఈ సినిమా తాజాగా ఓటీటీలోకి వచ్చేందుకు డేట్ ఫిక్స్ చేసుకుంది..
ఫేస్ బ్లైండ్‌నెస్ కాన్సెప్ట్‌తో క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా థియేటర్లలో మంచి విజయాన్నే అందుకుంది.. ఇక సినిమాలో రాశి సింగ్, పాయల్ రాధాకృష్ణ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఓటీటీ విడుదల తేదిని రీసెంట్ గా ప్రకటించారు.. మొన్న వచ్చిన ప్రసన్న వదనం సినిమా ఆహాలో మే 24 నుంచి స్ట్రీమింగ్ అవ్వబోతుంది.. అంబాజీపేట మ్యారేజి బ్యాండ్ మూవీ తర్వాత సుహాస్ నటించిన మరో చిత్రమే శ్రీరంగనీతులు. అంబాజీపేట మ్యారేజి బ్యాండ్ ఆహా ఓటీటీలోనే భారీ రెస్పాన్స్ ను అందుకుంది..
ఇక ఏప్రిల్ 11 న శ్రీరంగనీతులు సినిమా వచ్చింది.. అప్పటి నుంచి సినిమా ఓటీటీలోకి రాలేదు.. తాజాగా ఓటీటీ తేదీని అనౌన్స్ చేసింది.. ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ సంస్థ సోనీ లివ్ మంచి ధర వెచ్చించి కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇక ఈ మూవీని ఈ మే నెలలో కాకుండా వచ్చే నెలలో జూన్ 7న ఓటీటీ స్ట్రీమింగ్ చేయనున్నారట.. రెండు నెలలకు ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వబోతుందన్న మాట.. మరి ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి..