Sudheer Babu Pan India Movie: విభిన్న చిత్రాలతో అందరి దృష్టిని ఆకర్షిస్తోన్న హీరోలలో ఒకడు సుధీర్ బాబు. నవదళపతిగా పేరుతెచ్చుకున్న ఈయన ఓ సూపర్ నేచురల్ మిస్టరీ థ్రిల్లర్ లో నటించబోతున్నారు. ఈ సినిమా భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కనుంది. ప్రేక్షకులకు ఓ అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ను ఆడియెన్స్ కు అందించేలా.. ” లార్జర్ దేన్ లైఫ్ ” స్టోరీ లైన్ తో ఇంతవరకు ఎప్పుడు చూడని డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ చిత్రంలో విజువల్ ఎఫెక్ట్స్ కి ఎంతో ప్రాధ్యానత ఇవ్వబోతున్నారు. ఈ సినిమాతో వెంకట్ కళ్యాణ్ ఇండస్ట్రీకి మరో కొత్త దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
Ragi Java : ప్రతిరోజు రాగి జావా తాగితే ఇన్ని ప్రయోజనాలా..
ఇక గత నెలలో విడుదలైన ” హరోంహర ” చిత్రంతో సుధీర్ బాబు రీసెంట్ గా విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఇక ఇందులో యాక్షన్ సన్నివేశాలు, కథకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదివరకు రుస్తుం, టాయ్‌లెట్: ఏక్ ప్రేమ్ కథ, ప్యాడ్ మ్యాన్, పరి లాంటి విజయవంతమైన సినిమాలను అందించిన ” ప్రేరణ అరోరా ” సమర్పణలో ఇప్పుడు నవదళపతి చేయబోతున్నారు పాన్ ఇండియా సూపర్ నేచురల్ మిస్టరీ థ్రిల్లర్. ఈ సినిమా అతి త్వరలోనే చిత్ర యూనిట్‌తో బాలీవుడ్ హీరోయిన్ కూడా జాయిన్ అవ్వనుంది.
Babli Project Gates: బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీరు దిగువకు విడుదల
ఇక సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలను అతి త్వరలోనే మూవీ మేకర్స్ పూర్తి వివరాలను తెలియజేస్తారు. ఈ సినిమాని 2025 శివరాత్రి సందర్భంగా మార్చిలో విడుదల చేయనున్నట్లు సమాచారం. మంచి కథతో రానున్న ఈ చిత్రంలో కుట్ర, పన్నాగాలు కలగలిసిన చెడుకి, మంచి జరిగే యుద్ధంగా పాన్ ఇండియన్ సినిమాల్లో ఓ మైల్ స్టోన్ మూవీలా బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కనుంది.