Rs.100 Crore Cheque: విశాఖ సమీపంలోని సింహాచల క్షేత్రంలో ప్రసిద్ధమైన వరాహ నరసింహ స్వామి దేవాలయం ఉంది. దీనినే సింహాద్రి అప్పన్న కొండ అని కూడా పిలుస్తారు.. భక్తులు సింహాద్రి అప్పన్నగా కొలుస్తుంటారు.. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు గోదావరి సహా ఒడిషా ప్రజలకూ ఆరాధ్య పుణ్యక్షేత్రంగా ఉంది సింహాచలం.. అయితే, సింహాద్రి అప్పన్నకు రూ.100 కోట్ల చెక్ వచ్చింది.. హుండీలో 100 కోట్ల రూపాయల చెక్ డిపాజిట్ చేశారు బొడ్డేపల్లి రాధాకృష్ణ అనే భక్తుడు.. ఎంవీపీ డబుల్ రోడ్డు, విశాఖలోని కోటాక్ బ్యాంకుకు చెందిన చెక్ నంబర్ 530485009ను హుండీలో వేశాడు.. అయితే, ఆలయ చరిత్రలో ఈ స్థాయిలో హుండీలో లభించడం ఇదే తొలిసారి కాడంతో.. ఓవైపు సంతోషం.. మరోవైపు షాక్ తిన్నారు. అయితే, అది నకిలీది అని తెలిసి నోరువెల్లబెట్టాల్సిన పరిస్థితి వచ్చింది.
Read Also: Ban Sugar Exports: పెరుగుతున్న ద్రవ్యోల్బణం.. అక్టోబర్ నుంచి చక్కెర ఎగుమతులపై నిషేధం!
100 కోట్ల రూపాయల చెక్ చూసి మొదట షాక్ అయిన హుండీ లెక్కింపు సిబ్బంది.. భారీ విరాళం చెక్ చెల్లుతుందా..? లేదా..? అని అనుమానం వ్యక్తం చేశారు.. ఆ తర్వాత వెరిఫికేషన్ కోసం ఆలయ ఈవోకు చూపించారు.. ఇక, ఆ చెక్‌ను బ్యాంకుకు పంపించి ఆరా తీశారు ఈవో.. దాంతో, సింహాద్రి అప్పన్నకు వందకోట్లు చెక్ వచ్చిన మాట వాస్తవమే అయినా.. అది ఫేక్ అని తేలిపోయింది.. సదరు రూ.100 కోట్ల చెక్‌ను విరాళంగా సమర్పించిన భక్తుడి అకౌంట్లో కేవలం 17 రూపాయలు ఉన్నట్టు గుర్తించారు. అయితే, భక్తుడు రాధాకృష్ణ అడ్రస్ వివరాలు కోరుతూ బ్యాంకుకు లేఖ రాయాలని దేవస్థానం వర్గాల నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.. దురుద్దేశ పూర్వకంగా చెక్ వేసినట్టు గుర్తిస్తే.. చెక్ బౌన్స్ కేసు పెట్టే అవకాశం కూడా ఉన్నట్టుగా సమాచారం.