Earthquake: మంగళవారం (జులై 22) ఉదయం ఢిల్లీ – ఎన్‌సీఆర్ ప్రాంతాన్ని స్వల్పంగా భూకంపం కంపించింది. స్వల్పంగా కంపనలు గుర్తించినప్పటికీ, ఎలాంటి ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు. భారత జాతీయ భూకంప శాస్త్ర కేంద్రం (National Centre for Seismology) విడుదల చేసిన వివరాల ప్రకారం.. ఉదయం 6 గంటలకు 3.2 తీవ్రతతో భూకంపం నమోదైంది. ఈ భూకంపానికి హర్యానాలోని ఫరిదాబాద్ ప్రాంతం కేంద్రంగా నమోదైంది. Delivery Agent Urinates: లిఫ్ట్‌లో…
Earthquake: ఢిల్లీలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 6.0 తీవ్రతో భూకంపం సంభవించింది. దీంతో ఒక్కసారిగా ప్రజలు భయాందోళనకు గురై బయటకు పరుగులు తీశారు. ఢిల్లీతో పాటు జమ్మూ కాశ్మీర్, పంజాబ్, ఛండీగఢ్ రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి. మన దేశంతో పాటు పాకిస్తాన్ కూడా భూమి కంపించింది. ఇస్లామాబాద్‌తో పాటు పాక్ ఉత్తర భాగంలో ప్రకంపనలు సంభవించాయి.
Earthquake: ఢిల్లీలో మరోసారి భూమి కంపించింది. శనివారం ఢిల్లీలో 2.6 తీవ్రతతో మధ్యామ్నం 3.36 గంటలకు భూకంపం సంభవించింది. నార్త్ డిస్ట్రిక్ట్ లో భూమికి 10 కిలోమీటర్ల దిగువన భూకంప కేంద్రం ఉందని నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ వెల్లడించింది. ప్రాణ, ఆస్తినష్టం జరిగినట్లు ఎలాంటి నివేదికలు అందలేదు.
Delhi : భూకంపం ధాటికి ఢిల్లీ భూభాగం వణికిపోయింది. శుక్రవారం రాత్రి 11:32 గంటల ప్రాంతంలో సంభవించిన ఈ భూకంపం తీవ్రత 6.4గా నమోదైంది. ఉత్తర భారతదేశం అంతటా భూ ప్రకంపనలు సంభవించాయి.
Breaking News: దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 3.1 తీవ్రతతో భూకంపం వచ్చింది. ఈ రోజు సాయంత్రం 4.08 గంటలకు హర్యానా ఫరీదాబాద్‌లో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ(NCS) వెల్లడించింది. ఢిల్లీ చుట్టు పక్కల ప్రాంతాల్లో కూడా ప్రకంపనలు వచ్చాయి.
దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి భూకంపం సంభవించింది. మంగళవారం రాత్రి ఢిల్లీని భూకంపం వణికించిన విషయం తెలిసిందే. ఢిల్లీ ప్రజలను ఆ భయం వెంటాడుతున్న సమయంలోనే మరోసారి భూకంపం సంభవించడం గమనార్హం.
Earthquake: దేశ రాజధాని ఢిల్లీ మరోసారి భూప్రకంపనలతో వణికింది. వరసగా వారం వ్యవధిలో రెండు సార్లు ఢిల్లీలో భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. తాజాగా ఆఫ్ఘనిస్తాన్ లోని ఫైజాబాద్ లో 5.9 తీవ్రతలో భూకంపం సంభవించింది. దీని ప్రభావంతో పాకిస్తాన్, ఇండియాలోని పలు ప్రాంతాల్లో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఢిల్లీతో పాటు హర్యానా, జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్ ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చాయి. గురువారం రాత్రి 7.50 గంటల ప్రాంతంలో ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో భూకంప ప్రకంపనలు వచ్చాయి.