Piler Government Hospital: ప్రభుత్వ ఆస్పత్రిలో అన్నీ ఉచితం.. వైద్యం, టెస్ట్‌లు, మందులు ఇలా అన్నీ ఫ్రీగానే ఇస్తారు.. ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లే స్తోమత లేనివారు.. ప్రభుత్వ ఆస్పత్రినే నమ్ముకుంటారు.. ఇక, ప్రసవాల కోసం ఎక్కువ మంది ప్రభుత్వ ఆస్పత్రులను ఆశ్రయిస్తుంటారు.. కానీ, సరైన సౌకర్యాలు లేక గర్భిణిలు అల్లాడిపోతున్నారు. ఇదే ఎక్కడో కాదు.. ఆంధ్రప్రదేశ్‌లోనే.. అన్నమయ్య జిల్లా పీలేరు ప్రాంతీయ వైద్యశాలలో రోగులు విచిత్రమైన పరిస్థితి నెలకొంది..
Read Also: AP High Court: చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా..
ఆసుపత్రిలో వైద్యం ఉచితమే కానీ, ఎవరి ఫ్యాన్లు వారే తెచ్చుకోవాలి అనేలా తయారైంది పరిస్థితి.. పీలేరు పాత భవనంలోని ప్రసూతి వార్డులో రెండు సీలింగ్ ఫ్యాన్లు ఉన్నాయి. కానీ, అవి పాతవి కావడంతో వాటి నుంచి వచ్చే గాలి సరిపోవడం లేదు. దీంతో.. వార్డులోని మహిళలు ఉక్కపోతకు తట్టుకోలేక అల్లాడిపోతున్నారు.. రోగుల పరిస్థితిని క్యాష్ చేసుకోవడానికి ప్రైవేట్ వ్యక్తులు రంగ ప్రవేశం చేశారు.. ఆసుపత్రి ఆవరణలోని ప్రైవేటు మందుల దుకాణం నిర్వాహకులు ఫ్యాన్లను అద్దెకు ఇవ్వడం మొదలు పెట్టారు.. స్టాండింగ్ ఫ్యాన్లకు అద్దె వసూలు చేస్తూరు. ఒక్కో ఫ్యాన్ కోసం 500 రూపాయాలు డిపాజిట్ చేస్తే.. రోజుకు 50 రూపాయలు అద్దె వసూలు చేస్తున్నారు.. దీంతో.. రోగులు గగ్గోలు పెడుతున్నారు.. ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్తే స్తోమత లేకే.. ప్రభుత్వ ఆస్పత్రికి వస్తే.. ఇక్కడ ఫ్యాన్ల గోల ఏంటి? అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక, అధికారులకు పలుమార్లు ఈ విషయాలను చెప్పినా స్పందించడం లేదని వాపోతున్నారు రోగులు.