తెలంగాణలో ప్రభుత్వ ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను మెరుగుపరచడంలో మరో ప్రధాన మైలురాయిగా, మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (MHSRB) శుక్రవారం వైద్య మరియు ఆరోగ్య శాఖలో వివిధ స్థాయిలలో 5, 204 స్టాఫ్ నర్సుల పోస్టుల ప్రత్యక్ష నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలంగాణలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం పూనుకున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలో వరుసగా నోటిఫికేషన్లను విడుదల చేస్తోంది. అయితే.. తాజాగా మరో నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. 5,204 పోస్టులకు స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ద్వారా నియామకాలు చేపట్టనున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొంది.
Also Read : Dragon Fruit : ఆ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే డ్రాగన్ ఫ్రూట్ తినండి..!
అయితే.. అర్హులైన అభ్యర్థులు జనవరి 25 నుంచి ఫిబ్రవరి 15వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు. డీఎంఈ, డీహెచ్ పరిధిలో 3,823 పోస్టులను భర్తీ చేయనున్నారు. వైద్య విధాన పరిషత్‌లో 757 పోస్టులను భర్తీ చేయనున్నారు. డీఎంఈ, డీహెచ్ – 3,823, వైద్య విధాన పరిషత్ – 757, ఎంఎన్‌జే క్యాన్సర్ హాస్పిటల్ – 81, డిజబుల్డ్, సినీయర్ సిటిజెన్స్ వేల్ఫేర్ – 8, తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్స్ – 127, బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్స్ – 197, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్స్ – 74, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్స్ – 124, తెలంగాణ రెసిడెన్షియల్స్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్ – 13 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయబడింది.