విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా దొరికే పండు డ్రాగన్ ఫ్రూట్. ఇప్పుడు ఎక్కడబడితే అక్కడ విరివిగా లభిస్తున్న పండు.. పైన, గులాబి రంగులో ఉంటూ లోపల తెల్లని రంగు బుద్ధితో నల్లని మత్స లాంటి విత్తనాలతో రుచికి కాస్త పుల్లగా ఉంటుంది. ఇక ఈ ఫ్రూట్‌ను డ్రాగన్ ఫ్రూట్ అనే కాకుండా సూపర్ ఫ్రూట్ అని కూడా పిలుస్తుంటారు. అయితే ఈ ఫ్రూట్ దక్షిణ అమెరికాలో పుట్టి తూర్పు ఆసియాకు విస్తరించి చైనా, థాయిలాండ్, వియాత్నం ప్రజలకు అత్యంత ఇష్టమైన ఫలంగా మారింది. ఐరన్, ప్రోటీన్లు, పిండి పదార్థాలు, మెగ్నీషియం, విటమిన్ సి విటమిన్ ఈ, కెరోటినాయిడ్లు,, పాలీవెలాన్స్ తదితర విలువైన పోషకాలు ఈఫ్రూట్‌లో అధికంగా లభిస్తాయి.
Also Read : Cisco: టెక్కీలకు షాక్.. ఉద్యోగుల తొలగింపు ప్రారంభించిన సిస్కో..
అయితే డ్రాగన్ ఫ్రూట్ ఖరీదు కొంచెం ఎక్కువ అయినప్పటికీ దానికి తగ్గట్లే శరీరానికి శక్తినిచ్చే న్యూట్రియంట్స్ కూడా అధిక మోతాదులో ఈ పండ్లలో లభిస్తాయి. డ్రాగన్ ఫ్రూట్‌లో అధికంగా ఉండే యాంటీయాక్సిడెంట్‌లు గుండె జబ్బులు, కాన్సర్, షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా చేస్తాయి.
Also Read : Health Tips : కీళ్ల నొప్పులు ఉన్నాయా.. ఇవి అస్సలు తినకూడదు..!
ఈ పండులో పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల మలబద్దకం, జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. అంతేకాకుండా పండ్లను ఎక్కువగా తీసుకోవడం, సంతానం లేని సమస్య తొలగిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఇక మగవారు ఈ ఫ్రూట్ ఎక్కువగా తీసుకోవడం వల్ల వారిలో స్పెర్మ్ కౌంట్ పెరిగి ఫెర్టిలిటీ రేట్ పెరుగుతుంది. ఈ పండులో విటమిన్ సి, కెరోటినాయిడ్లు ఇమ్యూనిటీ బూస్టర్‌లుగా పని చేస్తాయి. రక్తంలో ప్లేట్లేట్స్ ని పెంచుతాయి. ఇక వైట్ బ్లడ్‌సెల్స్‌ను ఉత్పత్తి చేయడం ద్వారా రోగ నిరోధక శక్తిని పెరిగేలా చేస్తాయి. దీనితో అంటు వ్యాధులు కానీ, ఇతర జబ్బులు కానీ మన దరిచేరకుండా చేస్తాయి. డ్రాగన్ ఫ్రూట్ తింటే ఇనుము లోపాన్ని అధిగమించవచ్చు. మిగతా అన్ని పండ్లతో పోలిస్తే మెగ్నీషియం ఎక్కువగా ఉండేది డ్రాగన్ ఫ్రూట్‌లోనే. బరువు తగ్గాలి అనుకునేవారికి డ్రాగన్ ఫ్రూట్ బెస్ట్ పండని కూడా చెప్పవచ్చు.