Srisailam: శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీశైలంలో జరిగే శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ తరపున పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తున్న సంగతి తెలిసిందే. బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి తరపున టీటీడీ ఈవో ధర్మారెడ్డి శ్రీస్వామి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. నాలుగవరోజైన నేడు మయూరవాహనంలో స్వామిఅమ్మవార్లు భక్తులకు దర్శనమివ్వనున్నారు. సాయంత్రం మయూరవాహనంపై శ్రీశైలం పురవీధులలో స్వామిఅమ్మవార్లకు గ్రామోత్సవం నిర్వహించనున్నారు. శివస్వాములతో శ్రీశైలం ఆలయం పోటెత్తింది. భక్తుల రద్దీ భారీగా పెరిగింది.
Read Also: Chandrababu: వాలంటీర్ వ్యవస్థ ఉంటుంది.. రా కదలి రా సభలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
శ్రీశైలంలో శివరాత్రి బ్రహ్మోత్సవాల పట్టువస్త్రాలు సమర్పించిన అనంతరం టీటీడీ ఈవో ధర్మారెడ్డి కీలక ప్రకటన చేశారు. శ్రీశైలం దేవస్థానం స్థలం కేటాయిస్తే టీటీడీ దేవస్థానం తరపున 2 వందల గదుల భవనం కడతామని ఆయన ప్రకటించారు. క్షేత్రంలో టీటీడి సత్రం పాతపడటంతో వాటిని ఆధునీకరణ చేస్తామన్నారు. 2 వందల గదులకు శ్రీశైలం దేవస్థానం ఉత్తరపూర్వకంగా ఇస్తే వచ్చే నెల టీటీడీ బోర్డులో పెడతామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు.