Rammohan Naidu: కేంద్ర కేబినెట్‌లో చోటు దక్కినందుకు హర్షం వ్యక్తం చేశారు శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు. కాసేపట్లో కేంద్ర మంత్రిగా ప్రమాణం చేయనున్న తరుణంలో ఆయన సోషల్ మీడియాలో తన సందేశాన్ని విడుదల చేశారు. ఈ ఆనందానికి కారణమైన శ్రీకాకుళం జిల్లా ప్రజలకు ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. తన తండ్రి ఎర్రన్నాయుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ తనపై ఉన్నాయన్నారు. ఆయన ఆశీర్వాదమే తనను ముందుకు నడిపిస్తోందన్నారు. తనకు మార్గనిర్దేశం చేస్తూ ప్రోత్సహిస్తున్న చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కల్యాణ్, ప్రధాని మోడీ, ముఖ్యంగా అచ్చెన్నాయుడికి ధన్యవాదాలు తెలిపారు. తన కుటుంబ సభ్యులు ఎన్నో త్యాగాలు చేసి తాను మూడు సార్లు గెలవడానికి కారణమయ్యారని ఆయన వెల్లడించారు. తాను ఈ స్థాయిలో ఉండడానికి కారణం ప్రధానంగా శ్రీకాకుళం ప్రజలు అని.. వారికి శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నానన్నారు.
Read Also: BJP MP Srinivas Varma: నరసాపురం ఎంపీ శ్రీనివాస వర్మ భావోద్వేగం
ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఉఙ్వలంగా కనిపిస్తోందని ఎంపీ రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలపై శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి పథంలో నడిపేందుకు, దేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా తయారు చేయడమే తన లక్ష్యమన్నారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నుంచి ఎంత అవకాశం ఉంటే అంత సహకారం పొందాలన్నారు.
Thank you everyone for the love and support, all of this will not be possible without you. pic.twitter.com/3XxB4uamaI
— Ram Mohan Naidu Kinjarapu (@RamMNK) June 9, 2024