కేంద్ర కేబినెట్‌లో చోటు దక్కినందుకు హర్షం వ్యక్తం చేశారు శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు. కాసేపట్లో కేంద్ర మంత్రిగా ప్రమాణం చేయనున్న తరుణంలో ఆయన సోషల్ మీడియాలో తన సందేశాన్ని విడుదల చేశారు. ఈ ఆనందానికి కారణమైన శ్రీకాకుళం జిల్లా ప్రజలకు ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
మూడోసారి ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టేందుకు రెడీ అవుతున్నారు. ఆయన ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్ అయింది. జూన్ 9వ తేదీన సాయంత్రం 6 గంటలకు మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది.