దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కుమార్తె కీర్తి, ప్రముఖ వ్యాపారవేత్త మహేష్ రెడ్డి కుమారుడు నితేష్‌ల వివాహ రిసెప్షన్ ఇటీవల హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో జరిగింది. అంగరంగ వైభవంగా జరిగిన ఈ రిసెప్షన్‌కు సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) స్టార్ ఆటగాళ్లు అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, అభినవ్ మనోహర్‌లు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా అయింది.
ముంబై ప్లేయర్ ఇషాన్ కిషన్, పంజాబ్ ఆటగాడు అభిషేక్ శర్మలు నేరుగా వెళ్లి పెళ్లి కొడుకు నితేష్‌తో మాట్లాడడంతో అందరూ షాక్ అవుతున్నారు. నితేష్‌తో ఎస్‌ఆర్‌హెచ్ ఆటగాళ్ల కు ముందే పరిచయం ఉందా? అని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అలానే ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డికి హైదరాబాద్ ఆటగాళ్లతో సత్సంబంధాలు ఎమన్నా ఉన్నాయా అని ఆరా తీస్తున్నారు. ఏది ఏమైనా ఎస్‌ఆర్‌హెచ్ ఆటగాళ్లతో రిసెప్షన్‌కు గ్రాండ్ లుక్ వచ్చిందని చెప్పాలి. రిసెప్షన్‌లో అందరి చూపు భారత ఆటగాళ్లపైనే పడింది. ఈ రిసెప్షన్‌కు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్, ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సహా తదితర రాజకీయ నాయకులు హాజరయ్యారు.
ఐపీఎల్ 2025 మార్చి 22 నుంచి ఆరంభం కానుంది. మార్చి 23న రాజస్థాన్ రాయల్స్‌తో ఉప్పల్ వేదికగా ఎస్‌ఆర్‌హెచ్ తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం ఎస్‌ఆర్‌హెచ్ ప్లేయర్స్ కొందరు ఇప్పటికే హైదరాబాద్ చేరుకుని ప్రాక్టీస్ చేస్తున్నారు. ప్యాట్ కమిన్స్, ట్రావిస్ హెడ్ సహా పలువురు ఓవర్‌సీస్ ఆటగాళ్లు ఇంకా రావాల్సి ఉంది. గతేడాది ఫైనల్ చేరిన ఎస్‌ఆర్‌హెచ్.. ఈసారి కప్ కొట్టాలని చూస్తోంది. ప్రస్తుతం సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ అన్ని విభాగాల్లో బలంగా ఉంది.
Ishan Kishan, Abhishek Sharma and Abhinav Manohar attended MLA Kotha Prabhakar Reddy’s Daughter’s Wedding reception😁🔥@ishankishan51 #IshanKishan #SRH #AbhishekSharma #AbhinavManohar pic.twitter.com/gSV5Mrz9eB
— Ishan’s🤫🧘🧡 (@IshanWK32) March 12, 2025