Sreesanth: ఉత్తర కేరళలోని కన్నూర్ జిల్లాలో ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు టీమిండియా మాజీ క్రికెటర్ శ్రీశాంత్‌తో పాటు మరో ఇద్దరిపై పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. కర్ణాటకలోని కొల్లూరులో క్రికెటర్ శ్రీశాంత్ స్పోర్ట్స్ అకాడమీని నిర్మిస్తామని చెప్పి డబ్బులు వసూలు చేశారని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 2019 ఏప్రిల్ 25 నుంచి నిందితులు రాజీవ్ కుమార్, వెంకటేష్ కిని రూ. 18.70 లక్షలు తీసుకున్నారని చూండాకు చెందిన ఫిర్యాదుదారు ఆరోపించారు.
Read Also: Mumbai Indians: ఈ విదేశీ ఆటగాళ్లపై ముంబై ఇండియన్స్ ఫోకస్.. జట్టులోకి తీసుకునేందుకు వ్యూహాలు..!
అయితే.. అకాడమీలో భాగస్వామి అయ్యే అవకాశం రావడంతో ఆ డబ్బును పెట్టుబడి పెట్టినట్లు సరిష్ గోపాలన్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో శ్రీశాంత్‌తో పాటు మరో ఇద్దరిపై ఐపీసీ సెక్షన్ 420 (మోసం చేయడం, నిజాయితీగా ఆస్తుల పంపిణీని ప్రేరేపించడం) కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో శ్రీశాంత్‌ను మూడవ నిందితుడిగా చేర్చారు.
Read Also: Mahua Moitra: మహువా మోయిత్రా వివాదంపై తొలిసారి స్పందించిన దీదీ.. ఆమెకే ప్లస్ అంటూ..