Somireddy Chandramohan Reddy: వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యలపై కౌంటర్ ఎటాక్‌కు దిగారు టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. సీఎం చంద్రబాబు 76 ఏళ్ల ముసలివాడు అంటూ.. పేర్నినాని చేసిన కామెంట్‌పై ఫైర్ అయిన సోమిరెడ్డి.. మాజీ మంత్రి పేర్ని నానికి కొవ్వు ఎక్కువైంది. చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ ని, లోకేష్ ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు అని విరుచుకుపడ్డారు.. చంద్రబాబుతో పాటు పేర్ని నాని రామతీర్థం, అలిపిరి మెట్లు ఎక్కగలరా..? అనపర్తిలో చంద్రబాబు నడిచినట్లు 7 కిలోమీటర్లు నడవగలరా..? అని నిలదీశారు.. అయితే, నీ వయసు అయిపోయిందనే కదా? మొన్న పోటీ చేయలేదు.. అంటూ ఎద్దేవా చేశారు..
Read Also: Kethireddy Venkatarami Reddy: చంద్రబాబు ఉన్నప్పుడు పంట పెడితే నాశనమే..! కేతిరెడ్డి హాట్ కామెంట్స్
మరోవైపు, తన కుమారిడి రాజకీయ భవిష్యత్తు కోసం కొడాలి నాని, వంశీలను పేర్ని నాని ఇరికిస్తున్నాడని విమర్శించారు సోమిరెడ్డి… బతుకు జీవుడా అంటూ వల్లభనేని వంశీ ఇప్పుడే జైలునుండి బయటికి వచ్చారు.. కానీ, ఇరికించే ప్రయత్నం చేస్తున్నారన్నారు.. రప్పా రప్పా అని రాం గోపాల్ వర్మ తో వైసీపీ వాళ్ళు ఒక సినిమా తీయించుకోవచ్చు అని సలహా ఇచ్చారు.. పేర్ని నానితో పాటు జగన్ కూడా రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేశారు.. కాకాణి గోవర్ధన్ రెడడ్ఇ, నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి.. ఇలా పనికిమాలిన వాళ్లు వైసీపీలో ఉన్నారు అని విరుచుకుపడ్డారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి..
Read Also: Medak Murders: కలకలం సృష్టిస్తున్న చేతబడి హత్యలు.. అనుమానంతో తోడబుట్టిన వాళ్లనే..
ఇక, ఆశోక్ గణపతి రాజు గోవా గవర్నర్ గా నియమితులవ్వడం సంతోషం అని.. అశోక్ గజపతి చాలా క్రమశిక్షణ కల వ్యక్తి… రాజనీతిజ్ఞుడు… ప్రధాని నరేంద్ర మోడీ.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఈ విషయంలో ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు సోమిరెడ్డి.. అశోక్ గజపతి రాజుకి గవర్నర్ పదవి రావడం సంతోషం.. ఒక నిజాయితీ పరుడు అశోక్ గజపతి రాజు.. అలాంటి వ్యక్తికి ప్రధాని నరేంద్ర మోడీ గవర్నర్ పదవి ఇచ్చి గౌరవించారని పేర్కొన్నారు టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి..