జమ్మూ కాశ్మీర్‌లోని నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) సమీపంలోని నౌషేరాలో ల్యాండ్‌మైన్ పేలింది. ల్యాండ్‌మైన్‌పై కాలుపెట్టడంతో పేలుడు సంబవించి భారత ఆర్మీ జవాన్ వీరమరణం పొందాడు. పేలుడులో మరో ఇద్దరు సైనికులు గాయపడ్డారు. గాయపడిన సైనికులను ఆస్పత్రికి తరలించారు. మరోవైపు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టిన సైన్యం సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది. ఎల్ఓసీ వెంబడి పెట్రోలింగ్ చేస్తుండగా ఓ జవాన్ ల్యాండ్ మైన్ పై అడుగుపెట్టడంతో ప్రమాదవశాత్తు ట్రిగ్గర్ అయ్యింది. దీంతో పేలుడు సంభవించి ముగ్గురు ఆర్మీ జవాన్లక తీవ్ర…