RJ Balaji Sensational Comments on Animal Movie: సందీప్ రెడ్డి వంగా, రణబీర్ కపూర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘యానిమల్’ మూవీ విడుదలయ్యి చాలా రోజులు అయ్యింది. అయినా ‘యానిమల్’ గురించి ఇంకా చాలా మంది మాట్లాడుకుంటూనే ఉన్నారు అంటే ఈ సినిమా ఎంత ప్రభావితం చేసిందో అర్ధం చేసుకోవచ్చు. ఈ సినిమా పాత్ బ్రేకింగ్ అని కొందరు అంటే వైలెన్స్‌ను ఎంకరేజ్ చేసి, ఆడవారిని కించపరిచి, ప్రేక్షకులపై చెడు ప్రభావం చూపేలా చేశారని కొందరు అంటున్నారు. ఇక ఈ సినిమా మీద చాలా మంది సెలబ్రిటీలు విమర్శించారు. అలా విమర్శించిన వారి లిస్ట్‌లో ఒక తమిళ నటుడు కూడా జాయిన్ అయ్యాడు. ఆర్జేగా తన కెరీర్‌ను ప్రారంభించి.. ఆ తర్వాత నటుడిగా, దర్శకుడిగా మారిన ఆర్జే బాలాజీ తాజాగా ఒక ఇంటర్వ్యూలో ‘యానిమల్’ సినిమాపై తన ఒపీనియన్ బయటపెట్టాడు.
Sundeep Kishan: రవితేజ గారంటే చాలా గౌరవం ఉంది.. కానీ పోటీకి దిగక తప్పడం లేదు
అందులో ఆయన మాట్లాడుతూ తాను థియేటర్లలో యానిమల్‌ను చూడలేదు, కానీ చాలా మంది సినిమాను కేవలం సినిమాలాగా చూడమని, దానిని ఒక క్రాఫ్ట్‌లాగా చూడమని అంటుంటారు కానీ తనకు మాత్రం ప్రేక్షకులను థియేటర్లలో బంధించి ఒక అబ్బాయి అమ్మాయిని కొట్టడం చూపిస్తున్నారని హింసను ప్రేరేపిస్తున్నారు అనిపిస్తుందని పేర్కొన్నారు. ప్రేక్షకులు ఈ సినిమాను ఎంజాయ్ చేయడం నాకు నచ్చలేదని పేర్కొన్న ఆయన అలాంటి సీన్స్‌కు ఇది నార్మల్ రియాక్షన్ అని నాకు అనిపించడం లేదన్నారు. అలాంటి సీన్స్ చూసి నా సినిమాల్లో కూడా అలాంటివి పెట్టాలని ప్రభావితం చేయడం కరెక్ట్ కాదని, సినిమాలోని ఒక సీన్‌లో యాక్టర్‌ను షూస్ నాకమని చెప్తారని విన్నా, ఈ సినిమా చూసే యూత్ అంతా ఒక అమ్మాయితో అలా ప్రవర్తించడం కరెక్ట్ అనుకుంటారని సినిమాపై తన అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే ఈ సినిమా దర్శకుడు సందీప్ రెడ్డి మాత్రం సినిమాలోని ప్రతి సీన్ డిజైన్ చేయడానికి కధనే కారణం అని చెబుతూ ఉంటారు. మరి మీ ఉద్దేశం ఏంటి?