నటుడు సల్మాన్ ఖాన్ సోదరుడు సోహైల్ ఖాన్ టాలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్నాడు. “అర్జున్ సన్నాఫ్ వైజయంతి” సినిమాలో ఆయన విలన్ పాత్రలో నటించాడు. తాజాగా జరిగిన ఈ చిత్రం ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కి హాజరైన ఆయన, జూనియర్ ఎన్టీఆర్ మీద ప్రశంసల వర్షం కురిపించాడు. “జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘బృందావనం’ హిందీలో రిలీజ్ అయినప్పుడు నేను ఆ సినిమా చూశాను. నాకు బాగా నచ్చింది. నేను ఆ సినిమా హిందీ రైట్స్ కొనుక్కున్నాను. ఆ సినిమా తర్వాత నేను ఎన్టీఆర్‌కి పెద్ద ఫ్యాన్ అయిపోయాను. ఆ సినిమాను వచ్చే సంవత్సరం రీమేక్ చేసి రిలీజ్ చేస్తున్నాను. ఆ సినిమా కొంచెం పాతది కావచ్చు, కానీ అవుట్‌డేటెడ్ మాత్రం కాదు. నేను ఆ సినిమా చేసిన తర్వాత ముందు మీరే చూడాలి. నేను ముందుగా మీకే చూపిస్తాను ఎన్టీఆర్,” అని అన్నారు.
విజయశాంతి గారి గురించి మాట్లాడుతూ, “విజయశాంతి గారు, నేను మీకు పెద్ద అభిమానిని. మీలాంటి వారితో పని చేయడం మాకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. మీరు చేసిన సినిమాల గురించి విన్నప్పుడు చాలా ఆనందం కలుగుతుంది. మీరు ‘మేల్ లీడ్’, ‘ఫిమేల్ లీడ్’ అనే రెండు పదాలకు మధ్య తేడాను చెరిపేశారు. మీరు వాటిని సమానం చేశారు,” అని అన్నారు. ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడు ప్రదీప్ కి ధన్యవాదాలు తెలిపారు.