Prabhas : ప్రభాస్ రాబోయే సినిమాల్లో మోస్ట్ హైప్ ఉన్నది స్పిరిట్. సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో రాబోతున్న ఈ మూవీ గురించి ఏ చిన్న అప్డేట్ వినిపించినా సరే సోషల్ మీడియా ఊగిపోతోంది. ప్రస్తుతం ప్రభాస్ ది రాజాసాబ్, ఫౌజీ సినిమాల్లో బిజీగా ఉన్నాడు. అయితే స్పిరిట్ మూవీకి రంగం సిద్ధం చేసేందుకు ఈ రెండు సినిమాలను త్వరగా పూర్తి చేయాలని ఇప్పటికే డైరెక్టర్లకు ప్రభాస్ సూచించాడంట. త్వరలోనే ఆ రెండు సినిమాలు కంప్లీట్ చేసేసి స్పిరిట్ మూవీ షూటింగ్ స్టార్ట్ చేయాలని ప్రభాస్ భావిస్తున్నాడంట. ఒకసారి స్పిరిట్ సెట్స్ లోకి అడుగు పెడితే.. వేరే సినిమా చేయకూడదని సందీప్ కండీషన్ పెట్టినట్టు సమాచారం.
Read Also : Crime: పిల్లల ముందే భార్యని క్రూరంగా కొట్టి చంపిన కసాయి..
సందీప్ సినిమాలో జాలి, దయ, కరుణ అనేవి లేని పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ప్రభాస్ నటిస్తున్నాడు. అయితే ఈ సినిమా కోసం ప్రభాస్ భారీగా బరువు తగ్గబోతున్నాడంట. పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఇప్పటి వరకు ప్రభాస్ నటించలేదు. పోలీస్ ఆఫీసర్ లుక్ రావడం కోసం బరువు తగ్గడంతో పాటు ఆ లుక్స్ ను మెయింటేన్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం ప్రభాస్ ఫౌజీ, ది రాజాసాబ్ మూవీల తర్వాత స్పెషల్ సెషన్ లో పాల్గొనబోతున్నట్టు తెలుస్తోంది. ఈ ఏడాది చివర్లో స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీన్ని 2027లో రిలీజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.