Smriti Mandhana: టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ స్మృతి మంధాన – సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్ వివాహం అకస్మాత్తుగా వాయిదా పడింది. స్మృతి – పలాష్ వివాహం నవంబర్ 23 (ఆదివారం) మహారాష్ట్రలోని సాంగ్లిలో జరగాల్సి ఉంది. అయితే వివాహం జరగకముందే విషాదకరమైన సంఘటన స్మృతి ఇంట్లో జరిగింది. ఈ స్టార్ క్రికెటర్ తండ్రి అకస్మాత్తుగా అనారోగ్యానికి గురయ్యారు.
READ ALSO: Jabardasth Naresh : చెత్త అమ్ముకుంటూ బతికా.. జబర్దస్త్ నరేశ్ ఎమోషనల్
పలు నివేదికల ప్రకారం.. ఆకస్మిక పెళ్లి ఇంటికి అంబులెన్స్ వచ్చింది. దాంట్లో స్మృతి తండ్రి శ్రీనివాస్ మంధానను ఆసుపత్రికి తరలించారు. ఆమె తండ్రి ఆరోగ్యం క్షీణించడంతో, స్మృతి ప్రస్తుతానికి వివాహాన్ని వాయిదా వేయాలని నిర్ణయించుకుంది. మహారాష్ట్రలోని సాంగ్లిలో ఉన్న స్మృతి మంధాన కొత్త ఇంట్లో గత కొన్ని రోజులుగా వివాహ వేడుకలు జరుగుతున్నాయి. నవంబర్ 23వ తేదీ ఆదివారం సాయంత్రం 4:30 గంటల ప్రాంతంలో వివాహం జరగాల్సి ఉంది. కానీ ఊహించని విధంగా పెళ్లి కుమార్తె తండ్రి అనారోగ్యానికి గురి కావడంతో ఆనందకరమైన వాతావరణం అకస్మాత్తుగా మారిపోయింది.
ఈ సందర్భంగా స్మృతి మంధాన మేనేజర్ తుహిన్ మిశ్రా మీడియాతో మాట్లాడుతూ.. “శ్రీనివాస్ మంధాన ఈ రోజు ఉదయం అల్పాహారం తీసుకుంటున్న సమయంలో ఆయనకు ఆరోగ్యం క్షీణించింది. ఆయన కోలుకుంటారని అనుకున్నాం, కాబట్టి కొంతసేపు వేచి చూశాం. కానీ ఆ తర్వాత ఆయన పరిస్థితి మరింత దిగజారి ఆసుపత్రి పాలయ్యారు. స్మృతి తన తండ్రికి చాలా దగ్గరగా ఉంటుంది. అందుకే తన తండ్రి పూర్తిగా కోలుకునే వరకు పెళ్లి చేసుకోకూడదని ఆమె నిర్ణయించుకుంది” అని తెలిపారు. స్మృతి తన వివాహాన్ని నిరవధికంగా వాయిదా వేయాలని నిర్ణయించుకున్నట్లు తుహిన్ మిశ్రా వెల్లడించారు. “శ్రీనివాస్ మంధాన ఆరోగ్య పరిస్థితిని వైద్యులు ప్రస్తుతం పర్యవేక్షిస్తున్నారు. ఆయన కొన్ని రోజులు ఆసుపత్రిలోనే ఉండాల్సి ఉంటుందని వారు చెప్పారు. అందువల్ల, తన తండ్రి పూర్తిగా కోలుకునే వరకు వివాహం చేసుకోకూడదని స్మృతి నిర్ణయించుకుంది. అందుకని వివాహం నిరవధికంగా వాయిదా పడింది. మంధాన కుటుంబం గోప్యతను అందరూ గౌరవించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము” అని ఆయన వెల్లడించారు.
READ ALSO: Indian Army: పాకిస్థాన్‌కు నిద్ర దూరం చేసిన ‘రామ్ ప్రహార్’