Smriti Mandhana Haldi: స్మృతి మంధాన పరిచయం అక్కర్లేని పేరు. భారత మహిళల క్రికెట్ జట్టు ఓపెనర్‌గా, వైస్ కెప్టెన్‌గా స్మృతి మంధాన తన కంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఇటీవల వరల్డ్ కప్ గెలిచిన జట్టులో స్మృతి కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ప్రపంచ కప్ గెలిచిన అనంతరం ఆమె మరోమారు వార్తల్లోకి ఎక్కారు. ఈసారి ఆమె తన వ్యక్తిగత జీవితం కారణంగా వార్తల్లో నిలిచారు. ఇంతకు ఆమె ఎందుకు వార్తల్లో నిలిచారో తెలుసా.. ఆమె వివాహం నిశ్చయమైన సందర్భంగా. ఆమె ప్రముఖ సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్‌తో పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు. వీరిద్దరూ నవంబర్ 23న వివాహం చేసుకోబోతున్నారు.
READ ALSO: Akhanda 2 Thandavam Trailer: ‘అఖండ 2’ ట్రైలర్ అదరహో.. గూస్‌బంప్స్ పక్కా, ఫ్యాన్స్‌కి పూనకాలే!
స్టార్ట్ అయిన హల్దీ సెలబ్రేషన్స్..
ఈక్రమంలో స్మృతి మంధాన ఇంట్లో హల్దీ సెలబ్రేషన్స్ స్టార్ట్ అయిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఫోటోలో భారత మహిళల క్రికెట్ జట్టు ప్లేయర్స్, స్మృతి కుటుంబ సభ్యులు, సన్నిహితులు కనిపించారు. ఇప్పటికే ప్రధాని మోడీ సహా పలువురు ప్రముఖులు ఈ జంటకు ముందస్తు శుభాకాంక్షలు కూడా తెలిపారు. ఈ ఫోటోలలో ఆమె చాలా సంతోషంగా, ఆనందంగా కనిపించారు. తన స్నేహితుల కేరింతల మధ్య, మనసిచ్చిన వరుడిని మనువాడబోతూ స్టైలిష్ లుక్ అదరగొట్టింది స్మృతి. డాన్స్ చేస్తూ, సాధారణంగా హల్దీ సెలబ్రేషన్స్ అంటే ఉండే హైప్ కంటే స్మృతి ఇంట జరిగిన వేడుకల్లో కనిపించిన జోష్ చాలాచాలా ఎక్కువగా ఉంది. భారత మహిళా క్రీడా జట్టు సభ్యులు స్మృతి మంధాన ఇంట జరిగిన హల్దీ సెలబ్రేషన్స్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
శుక్రవారం స్మృతి మంధానకు కాబోయే వరుడు పలాశ్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశాడు. ఈ వీడియోలో ఇటీవల భారత మహిళ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరిగిన ముంబయిలోని డీవై పాటిల్ స్టేడియంలో స్మృతి మంధానకు మోకాళ్లపై నిలుచుని తన ప్రేమను వ్యక్తం చేశాడు. తర్వాత మంధాన అతణ్ని కౌగిలించుకుంది. అనంతరం వాళ్లిద్దరూ ఉంగరాలు మార్చుకున్నారు. పలాష్ ముచ్చల్ బాలీవుడ్ యువ స్వరకర్తలలో ఒకరిగా, సంగీత దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు. పలాష్ 2014లో శిల్పా శెట్టి చిత్రం “డిష్కియోన్”తో స్వరకర్తగా తన కెరీర్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత ఆయన “భూత్‌నాథ్ రిటర్న్స్” వంటి చిత్రాలకు సంగీతం సమకూర్చారు.
READ ALSO: New Labour Laws 2025: దేశ వ్యాప్తంగా తక్షణమే అమల్లోకి నాలుగు లేబర్ కోడ్‌లు..
first look of smriti as a bride and she looking so gorgeous😍😍😍 pic.twitter.com/Lx0pBeLFq8
— IWCT WORLD CHAMPIONS🎊 (@mandyyc0re) November 21, 2025