New Labour Laws 2025: కేంద్ర ప్రభుత్వం 29 కార్మిక చట్టాల స్థానంలో కొత్తగా నాలుగు లేబర్ కోడ్‌లను రూపొందించింది. ఈ నాలుగు లేబర్ కోడ్‌లను తక్షణమే అమల్లోకి తీసుకొస్తున్నట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ ప్రకటించారు. ఈ సంస్కరణలు ఉద్యోగ భద్రత, సామాజిక భద్రత, సమాన వేతనాలు, మహిళా సాధికారతతో పాటు, అసంఘటిత రంగ కార్మికులకు ముఖ్యంగా గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ కార్మికులకు రక్షణ కల్పించడంలో మైలురాయిగా నిలవనున్నాయని ఆయన పేర్కొన్నారు.
READ ALSO: Diabetes: డయాబెటిస్‌కు నిజమైన శత్రువు ఏమిటో తెలుసా? షుగర్ అయితే కాదు!
* ఉద్యోగుల సంక్షేమం, భద్రతే లక్ష్యంగా
* కనీస వేతనానికి గ్యారెంటీ, గ్రాట్యూటీ, సామాజిక భద్రతకు పెద్దపీట
* కార్మికులందరికీ కనీస వేతనం గ్యారెంటీ
* అపాయింట్మెంటు లెటర్ గ్యారెంటీ
* సమాన పనికి సమాన వేతనం
* మహిళల ఆమోదం, భద్రత చర్యలకు లోబడి రాత్రి వేళలో స్త్రీలు పని చేయడానికి అనుమతి
* 40 కోట్ల మంది కార్మికులకు సోషల్ సెక్యూరిటీ
* ఏడాది తర్వాత ఫిక్స్డ్, టర్మ్ ఎంప్లాయిస్‌కు గ్రాట్యూటీ
* 40 ఏళ్ల పైబడిన కార్మికులకు ఉచితంగా ప్రతి ఏడాది హెల్త్ చెకప్
* ఓవర్ టైం కు రెట్టింపు వేతనం
* ప్రమాదకర రంగాల్లో పనిచేసే వారికి 100% ఆరోగ్య రక్షణ
* అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం కార్మికులకు సామాజిక న్యాయం
READ ALSO: Sridhar Babu: గ్లోబల్ సిటీని అడ్డుకోవాలని బీఆర్ఎస్ చూస్తుంది..