నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా, మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన చిత్రం ‘అఖండ 2: తాండవం’. బ్లాక్ బస్టర్ మూవీ ‘అఖండ’కు ఇది సీక్వెల్. ఈ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మించగా.. బాలయ్య బాబు చిన్న కూతురు తేజస్విని సమర్పిస్తున్నారు. మోస్ట్ అవైటెడ్ అఖండ 2 సినిమా పాన్ ఇండియా స్థాయిలో డిసెంబర్ 5న రిలీజ్ అవుతోంది. ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. అఖండ 2 ట్రైలర్ కోసం ఫాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. చిత్ర యూనిట్ నేడు ట్రైలర్‌ను రిలీజ్ చేసింది.
‘కష్టమొస్తే దేవుడొస్తాడని నమ్మే జనానికి.. కష్టమొచ్చినా దేవుడు రాడు అని నమ్మించాలి’ అనే డైలాగ్‌తో అఖండ 2: తాండవం ట్రైలర్ మొదలైంది. ‘ఎనమిది కంఠాలు తెగాలి, రక్తం చిందాలి’, ‘ఇప్పటి వరకూ ప్రపంచపటంలో ఉన్న మా దేశ రూపాన్ని మాత్రమే చూసుంటావ్.. ఎప్పుడూ మా దేశ విశ్వరూపాన్ని చూసుండవ్’ అనే పవర్‌ఫుల్ డైలాగులు అభిమానులకు గూస్‌బంప్స్ తెప్పిస్తున్నాయి. విజువల్స్, మ్యూజిక్, బ్యాగ్రౌండ్ స్కోర్ మరో లెవల్లో ఉన్నాయి. బాలయ్య బాబు నటన, డైలాగ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అఘోర పాత్రలో నట విశ్వరూపం చూపించారు. మొత్తంగా ట్రైలర్ అదరహో అనే చెప్పాలి. ట్రైలర్ అఖండ 2పై భారీగా అంచనాలను పెంచింది.
అఖండ 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను కర్ణాటకలోని చిక్కబళ్లాపురలో చిత్ర యూనిట్ నిర్వహించింది. కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ (శివన్న) చీఫ్ గెస్టుగా హాజరయ్యారు. సనాతన ధర్మం ప్రధానాంశంగా అఖండ 2ని రూపొందిస్తున్నట్టు ట్రైలర్ చూస్తే ఇట్టే అర్థమవుతోంది. ఆది పినిశెట్టి ప్రత్యేక పాత్రలో నటించారు. బాలయ్య సరసన సంయుక్త మీనన్ నటించారు. అఖండ 2 కేవలం తెలుగులోనే కాదు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. సీక్వెల్‌ను బాబు కెరీర్‌లోనే అత్యధికంగా రూ.200 కోట్లకు పైగా బడ్జెట్‌తో నిర్మించినట్లు సమాచారం.