TS SSC Supplementary: జూన్ 3వ తేదీ నుండి టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TS SSC Results 2024: తెలంగాణ 10వ తరగతి వార్షిక పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఇవాళ ఉదయం 11 గంటలకు బషీర్‌బాగ్‌లోని ఎస్‌సిఇఆర్‌టి కార్యాలయంలో విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం పది ఫలితాలను విడుదల చేశారు. బుర్రా వెంకటేశం మాట్లాడుతూ.. జూన్ 3వ తేదీ నుండి 13 జూన్ వరకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఫీజులు కట్టే విషయం త్వరలో క్లారిటీ ఇస్తామని ప్రకటించారు.
Also Read
కాగా.. గతేడాదితో పోల్చుకుంటే ఉత్తీర్ణత శాతం పెరిగిందన్నారు. ఈ సంవత్సరము 06 పాఠశాలలు సున్నా శాతము ఫలితాలు పొందాయి. రాష్ట్రంలో నిర్మల్ జిల్లా అన్ని జిల్లాల కంటే 99.05 % ఉత్తీర్ణత సాధించి ప్రథమ స్థానములో ఉందన్నారు. అదే విధముగా రాష్ట్రములో వికారాబాద్ జిల్లా అన్ని జిల్లాల కంటే అతి తక్కువ శాతము అనగా 65.10 % సాధించి చివరి స్థానములో ఉందని తెలిపారు. పదోతరగతి ఫలితాల్లో 91.31 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాలికలు 93.23 శాతం, బాలురు 89.42 శాతం ఉత్తీర్ణత సాధించారు. 3,927 పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణత సాధించగా, ఆరు పాఠశాలల్లో సున్నా శాతం నమోదైంది.
మొత్తం 5,05,813 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 4,91,862 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఈ ఏడాది మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు పదో వార్షిక పరీక్షలు నిర్వహించగా.. 5,08,385 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 2,57,952 మంది బాలురు, 2,50,433 మంది బాలికలు ఉన్నారు. పది పాలిటాల కోసం నమస్తే తెలంగాణ తెలంగాణ వెబ్‌సైట్‌లో కూడా అందుబాటులో ఉంది. విద్యార్థులు https://ntvtelugu.com/telangana-ssc-results-2024 వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
తాజావార్తలు
-
LV Prasad Hospital: అమరావతిలో ఎల్.వి.ప్రసాద్ కంటి ఆసుపత్రి.. 12 ఎకరాల స్థలంలో నిర్మాణం..
-
Trump: ట్రంప్ దౌత్యం విఫలం.. మరోసారి ఇంధన వసతులపై రష్యా-ఉక్రెయిన్ పరస్పర దాడులు
-
TGTET ఇన్‌సర్వీస్ కీ విడుదల.. అభ్యంతరాలకు ఇదే చివరి ఛాన్స్.!
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’ టికెట్ రేట్ల భారీ పెంపు.. అసలు నిజమిదే!
-
Agni veer Rally: సైనిక కల కల్లైంది.. విశాఖ అగ్నివీర్ ర్యాలీలో విషాద ఛాయలు..
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్‌ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?