దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగుతున్నాయి. ఏడు విడతల్లో పోలింగ్ జరగనుంది. ఇప్పటికే రెండు విడతల్లో పోలింగ్ ముగిసింది. ఇక మూడో విడత పోలింగ్ మే 7న జరగనుంది.
ఉదయగిరి తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ నియోజకవర్గంలోని పలు పెళ్లి వేడుకల్లో ఆదివారం పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. జలదంకి మండలం జమ్మల పాలెంలో ఉన్నటువంటి ఎస్విఆర్ కళ్యాణ మండపంలో కలిగిరి మండలం వెలగపాడు పంచాయతీ పరిధిలోని కొత్తూరు గ్రామానికి చెందిన బొల్లా హనుమంతరావు, కోటేశ్వరమ్మ దంపతుల కుమారుడు చరణ్, వినీల వివాహ మహోత్సవంలో కాకర్ల సురేష్ పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.