తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. నిన్నటి వరకు జరిగిన అసెంబ్లీలో పాత ప్రభుత్వంపై బురద చల్లడం కోసమే జరిపారన్నారు. ప్రభుత్వం ఏమి చేయదల్చుకుందో నిర్దిష్టంగా చెప్పలేదని, మ్యానిఫెస్టోలో చెప్పిన అంశాలు 100 రోజుల్లో కాదు..72 రోజుల్లోనే అమలు చేయలేమని చేతులు ఎత్తేసిందన్నారు నిరంజన్ రెడ్డి. హరీష్ రావు మాట్లాడు తుంటే ఆరుగురు మంత్రులు కలిసి అడ్డుకునే ప్రయత్నం చేశారన్నారు.
పొంతన లేని బడ్జెట్ కేటాయింపులు చేసింది కాంగ్రెస్ పార్టీ అని, పక్క రాష్ట్రాల్లో కాంగ్రెస్ హామీలు అమలు చేయకుంటే బీజేపీ ప్రశ్నిస్తోందన్నారు నిరంజన్ రెడ్డి. కానీ తెలంగాణ లో కాంగ్రెస్ ను బీజేపీ ఎందుకు ప్రశ్నించడం లేదని, కేసీఆర్ ప్రభుత్వం పై ఒంటి కాలిపై లేచిన బీజేపీ… కాంగ్రెస్ ను ఎందుకు అడగడం లేదన్నారు నిరంజన్ రెడ్డి. మూడు ఎకరాల లోపు వాళ్లకు మాత్రమే రైతు బంధు పడిందని, మిగతా రైతులకు రైతు బంధు ఎందుకు ఇవ్వట్లేదన్నారు. బాలింతలకు ఇవ్వాల్సిన కేసీఆర్ కిట్లు ఇవ్వట్లేదని, ఎందుకు ఇవ్వట్లేదు చెప్పాలన్నారు. కొడంగల్ లో మెడికల్ కాలేజి కొత్తది పెట్టండి… కానీ ఆలేరు లో ఉన్న మెడికల్ కాలేజి ని షిఫ్ట్ చేయకండన్నారు. వనపర్తి లో ఉన్న సరళ సాగర్ ప్రాజెక్టు నిజాం కట్టారు అని ఉత్తమ్ కుమార్ రెడ్డి తప్పు చెప్పారని, గత ప్రభుత్వాన్ని తిట్టాలి అని… చాలా తప్పులు మాట్లాడుతున్నారన్నారు.
CM Jagan: ఫ్యాన్ ఎప్పుడూ ఇంట్లోనే ఉండాలి.. సైకిల్ ఎప్పుడూ బయటే ఉండాలి..