Lawrence Bishnoi: ఇద్దరు గ్యాంగ్‌స్టర్స్, రెండు గ్యాంగుల మధ్య వార్ ఇప్పుడు సంచలనంగా మారింది. గ్యాంగ్‌స్టర్ రోహిత్ం గోదారా, మరో గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌ని ‘‘దేశద్రోహి’’గా ఆరోపించాడు. బిష్ణోయ్ అమెరికా ఏజెన్సీతో కుమ్మక్కయ్యాడని, సున్నితమైన సమాచారాన్ని ఇస్తున్నట్లు వెల్లడించారు. ధ్రువీకరించని ఓ సోషల్ మీడియా పోస్ట్‌లో గోదారా, బిష్ణోయ్‌పై ఈ వ్యాఖ్యలు చేశారు.
Gangster Goldy Brar: ఫేమస్ పంజాబీ సింగర్ సిద్ధూ మూసే వాలాను రెండేళ్ల క్రితం గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ ముఠా హతమార్చింది. 2022 మేలో పంజాబ్‌లోని మాన్సా జిల్లాలోని సొంతూరులో తన ఎస్‌యూవీ కారులో ప్రయాణిస్తున్న సమయంలో, అతి సమీపం నుంచి కాల్పులు జరిపారు. దీంతో మూసే వాలా అక్కడిక్కడే మరణించాడు. ఆయన ప్రయానిస్తున్న కారుపైకి 100 కన్నా ఎక్కువ బుల్లెట్లు ఫైర్ చేశారు.
Goldy Brar : పంజాబ్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ బతికే ఉన్నాడు. ఆయన మరణ వార్త బుధవారం మీడియాలో వచ్చింది. తదనంతరం కాలిఫోర్నియాలోని ఫ్రెస్నో పోలీస్ డిపార్ట్‌మెంట్ దీనిని ఖండించింది.
Sidhu Moose Wala assassination Mastermind Goldy Brar Detained In California: పంజాబీ సింగర్, పొలిటికల్ లీడర్ సిద్దూ మూసేవాలా హత్యలో ప్రధాన కుట్రదారుడిగా భావిస్తున్న గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్‌ను అమెరికాలో అరెస్ట్ చేశారు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడు అయిన గోల్డీ బ్రార్ మూసేవాలా హత్యలో మాస్టర్ మైండ్. ఇటీవల కెనడా నుంచి యూఎస్ఏకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలో కాల్నిఫోర్నియాలో నవంబర్ 20న గోల్డీ బ్రార్ ను అమెరికా పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమచారం.…
పంజాబీ గాయకుడి హత్యకు ప్రధాన సూత్రధారి అయిన కెనడాకు చెందిన గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్‌ను అరెస్టు చేయడానికి దారితీసే ఏదైనా సమాచారం కోసం కేంద్ర ప్రభుత్వం రూ.2 కోట్ల రివార్డును ప్రకటించాలని గాయకుడు సిద్ధూ మూసేవాలా తండ్రి గురువారం డిమాండ్ చేశారు.
ఇటీవల సల్మాన్ ఖాన్‌కు తనతో పాటు తండ్రి సమీర్ ఖాన్‌ను చంపేస్తామంటూ ఓ బెదిరింపు లేఖ వచ్చిన విషయం తెలిసిందే! ప్రస్తుతం జైలుశిక్ష అనుభవిస్తున్న లారెన్స్ బిష్ణోయ్ వర్గానికి చెందిన వారే ఆ లేఖ పంపినట్టు పోలీసు విచారణలో తేలడంతో.. అతడ్ని కూడా ప్రశ్నిస్తున్నారు. తొలుత ఆ బెదిరింపు లేఖతో తనకెలాంటి సంబంధం లేదని చెప్పిన బిష్ణోయ్.. తాజా విచారణలో మాత్రం తమ వర్గం ఎప్పటికీ సల్మాన్‌ని క్షమించదని బాంబ్ పేల్చాడు. ‘‘కృష్ణ జింత హత్య విషయంలో…
ఇటీవల బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్‌కు బెదిరింపుల లేఖ వచ్చిన విషయం తెలిసిందే! పంజాబ్ సింగర్ సిద్ధూ మూసేవాలాని ఎలా కాల్చి చంపామో.. అలాగే నిన్ను, నీ తండ్రి సలీమ్ ఖాన్‌ను చంపేస్తామంటూ అతనికి లేఖ వచ్చింది. ఈ లేఖ అందుకున్న వెంటనే సల్మాన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, అతనికి భద్రత పెంచడంతో పాటు దర్యాప్తును వేగవంతం చేశారు. ఇన్నిరోజులు ఈ లేఖపై స్పందించని సల్మాన్.. తాజాగా ఓపెన్ అయ్యాడు. ఈ వ్యవహారంలో తనకు ఎవరిపైనా అనుమానాలు…
ప్రముఖ పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలా దారుణ హత్యకు గురైన సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. అతడ్ని చంపింది తామేనని గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టడంతో.. ఆ దిశగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌కి గోల్డీ బ్రార్ అత్యంత సన్నిహితుడు. దీంతో.. జైలు నుంచే బిష్ణోయ్ ఈ హత్యకు కుట్ర పన్ని ఉంటాడన్న అనుమానంతో పోలీసులు అతడ్ని రిమాండ్‌లోకి తీసుకొని, విచారించే చర్యలు మొదలుపెట్టారు. కొన్ని…