Anmol Bishnoi: ఎన్సీపీ నాయకుడు బాబా సిద్ధిఖీ హత్య కేసులో వాంటెడ్ గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్‌ను బుధవారం ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. బుధవారం ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు జాతీయ దర్యాప్తు సంస్థ 11 రోజుల కస్టడీకి పంపింది. అమెరికా నుంచి బహిష్కరించబడిన తర్వాత ఫెడరల్ ఏజెన్సీ అతడిని అరెస్ట్ చేసిన తర్వాత, అన్మోల్‌ని సాయంత్రం 5 గంటల ప్రాంతంలో గట్టి భద్రత మధ్య ఎన్ఐఏ కోర్టులో హాజరుపరిచింది.
పంజాబీ గాయకుడి హత్యకు ప్రధాన సూత్రధారి అయిన కెనడాకు చెందిన గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్‌ను అరెస్టు చేయడానికి దారితీసే ఏదైనా సమాచారం కోసం కేంద్ర ప్రభుత్వం రూ.2 కోట్ల రివార్డును ప్రకటించాలని గాయకుడు సిద్ధూ మూసేవాలా తండ్రి గురువారం డిమాండ్ చేశారు.
దేశంలో సంచలనం సృష్టించిన ప్రముఖ పంజాబీ గాయకుడు, కాంగ్రెస్ నేత సిద్ధూ మూసేవాలా హత్య కేసులో ఊహించిందే జరిగింది. ఈ హత్య కుట్రకు మాస్టర్ మైండ్ గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ అనే ఢిల్లీ పోలీసులు తేల్చేశారు. ప్రస్తుతం తిహాడ్ జైలులో ఉన్న అతడిని పలు దఫాలుగా విచారించిన దిల్లీ ప్రత్యేక పోలీసులు.. ఈ కేసుకు సంబంధించిన వివరాలను బుధవారం మీడియాకు వెల్లడించారు. అయితే పంజాబ్ సిట్ దీనిని ధృవీకరించాల్సి ఉంది. మే 29వ తేదీన హత్యకు గురయ్యాడు…