గుజరాత్ కసాయి ప్రధాని మోదీ అంటూ పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై బీజేపీ నాయకులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఉగ్రవాదానికి సంబంధించి ఐక్యరాజ్యసమితి సెక్యూరిటీ కౌన్సిల్‌లో పాక్ పరువును భారత్ తీయడంతో ఆయన తట్టుకోలేక ఈ వ్యాఖ్యలు చేశారు.
పంజాబీ గాయకుడి హత్యకు ప్రధాన సూత్రధారి అయిన కెనడాకు చెందిన గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్‌ను అరెస్టు చేయడానికి దారితీసే ఏదైనా సమాచారం కోసం కేంద్ర ప్రభుత్వం రూ.2 కోట్ల రివార్డును ప్రకటించాలని గాయకుడు సిద్ధూ మూసేవాలా తండ్రి గురువారం డిమాండ్ చేశారు.