Shyamala Devi: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా.. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అత్యధిక పారితోషకం అందుకుంటూ రికార్డు సృష్టించారు రెబల్ స్టార్ ప్రభాస్. బాహుబలి సినిమా తర్వాత తాను ప్రతి ప్రాజెక్టు పాన్ ఇండియా రేంజ్ లో భారీ బడ్జెట్ లో ఎంచుకుంటూ తన సినిమా ఫ్లాప్ అయినా సరే నిర్మాతలకు నష్టం రాకుండా కలెక్షన్లు తెచ్చి పెడుతూ మంచి పాపులారిటీ అందుకున్నారు. అందుకే ప్రభాస్ తో సినిమా చేయడానికి దర్శక నిర్మాతలు కూడా క్యూ కడుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి2898AD సినిమా చేసి భారీ విజయాన్ని అందుకున్నారు. కెరీర్లో వరుస సినిమాలు ప్రకటిస్తూ బిజీగా మారిన ప్రభాస్ 40ఏళ్లు దాటినా కూడా ఇంకా పెళ్లి చేసుకోకుండా సింగిల్ గా ఉండడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. గతంలో తనతో కలిసి నటించిన చాలామంది హీరోయిన్లతో ఎఫైర్ రూమర్స్ కూడా వచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అనుష్కతో ఏడడుగులు వేయడానికి రెడీగా ఉన్నారని, ఇద్దరు ప్రేమించుకుంటున్నారంటూ వార్తలు వినిపించాయి. కానీ ఈ వార్తల్లో కూడా నిజం లేకపోయింది.
తాజాగా ప్రభాస్ పెళ్లికి సంబంధించి మరో వార్త వెలుగులోకి వచ్చింది. తాజాగా ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి.. ప్రభాస్ పెళ్లి పై ఆసక్తికర కామెంట్లు చేయడంతో అందరూ నిజమని నమ్ముతున్నారు. ప్రస్తుతం దేవీ నవరాత్రులు జరుగుతున్న నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్న శ్యామలాదేవి మాట్లాడుతూ.. హీరో ప్రభాస్ పెళ్లిపై కీలక ప్రకటించారు. త్వరలోనే ప్రభాస్ కి పెళ్లి అవుతుందని కూడా ఆమె తెలిపారు. అమ్మవారి ఆశీస్సులు, కృష్ణంరాజు గారి దీవెనలు ప్రభాస్ పై ఎప్పుడూ ఉంటాయి. త్వరలోనే పెళ్లవుతుంది.. దీనిని మీరందరూ చూస్తారు ..ఆ రోజు అందరినీ పేరు పేరునా ఆహ్వానిస్తాము అంటూ శ్యామలాదేవి చెప్పింది.. ఇక శ్యామల దేవి ఈ కామెంట్లు చేయడంతో అభిమానులంతా తెగ సంతోషపడుతున్నారు. ఏది ఏమైనా శ్యామలాదేవి ప్రభాస్ పెళ్లిపై చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి.
Read Also:Srinivasulu Whatsapp Story: కరీంనగర్ లో వాట్సాప్ గ్రూప్.. ట్రెండింగ్ అవుతున్న శ్రీనివాస్ అనే పేరు..