టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ శ్రేయస్ అయ్యర్‌కు ఫైనల్స్ ఏ కలిసి రావడం లేదు. ఐపీఎల్ ఫైనల్ లో ఆర్సీబీతో జరిగిన టైటిల్ మ్యాచ్ లో అయ్యర్ సారధ్యం వహించిన పంజాబ్ కింగ్స్ ఓడిపోయింది. పదిరోజుల తర్వాత అయ్యర్ సారధ్యం వహించిన సోబో ముంబయి ఫాల్కన్స్ జట్టు ఫైనల్లో సౌత్ సెంట్రల్ మరాఠా రాయల్స్ చేతిలో ఓడిపోయింది. ఈ పది రోజుల వ్యవధిలో అయ్యర్ రెండు సార్లు ఛాంపియన్ అయ్యే అవకాశాన్ని కోల్పోయాడు. ఈ ఫైనల్ మ్యాచ్ కి టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. అయితే ట్రోఫీ ప్రజెంటేషన్ కార్యక్రమంలో అయ్యర్ బిహేవియర్ విమర్శలకు దారి తీసింది. రన్నరప్‌గా నిలిచిన శ్రేయస్ అయ్యర్ టీమ్‌కు 50 లక్షల ప్రైజ్‌మనీని అందజేసిన హిట్ మ్యాన్.. మెడల్ ను శ్రేయస్ అయ్యర్ మెడలో వేయబోతుండగా రోహిత్ శర్మకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు.
Mangli: గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ సాంస్కృతిక కార్యక్రమాల్లో సింగర్ మంగ్లి
రోహిత్ చేతుల్లో నుంచి మెడల్ లాక్కుని అక్కడినుంచి వెళ్ళిపోయాడు. ఆ సమయంలో రోహిత్ కూడా ఇబ్బందిగా ఫీల్ అయినట్లు అనిపించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు అయ్యర్ పై మండిపడుతున్నారు. బలుపా.. అహకారమా అని ఫైర్ అవుతున్నారు. అయితే కొందరు ఫ్యాన్స్ మాత్రం భిన్నంగా స్పందిస్తున్నారు. రోహిత్ అయ్యర్ మంచి ఫ్రెండ్స్ అని, వాళ్ళిద్దరికీ ఇవన్నీ కామనే అని కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా అయ్యర్ అలా చేసి ఉండాల్సింది కాదు. రోహిత్ ఇచ్చిన మెడల్ ని మేడలో వేసుకుని తనదైన స్టైల్ లో వాక్ చేసుకుంటూ వెళ్తే బాగుండేది.
Nani : నేచురల్ స్టార్ నానిని కలిసిన.. ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ డైరెక్టర్ అభిషన్