తెలంగాణ సినీ పరిశ్రమలో ప్రతిష్ఠాత్మకమైన గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025 కార్యక్రమం హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో జూన్ 14, 2025న అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ కార్యక్రమంలో ప్రముఖ గాయని మంగ్లితో పాటలు పాడించనున్నారు. ఈ మేరకు ఆమె ప్రస్తుతానికి స్టేజ్ మీద రిహార్సల్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే, ఇటీవల ఆమె పుట్టిన రోజు వేడుకలకు సంబంధించిన వివాదాస్పద సంఘటన కారణంగా మంగ్లి వార్తల్లో నిలిచింది.
Also Read:Nani : నేచురల్ స్టార్ నానిని కలిసిన.. ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ డైరెక్టర్ అభిషన్
చేవెళ్లలోని ఒక రిసార్ట్‌లో జరిగిన ఆమె పుట్టిన రోజు పార్టీలో గంజాయి సేవించిన వ్యక్తి పట్టుబడటంతో పోలీసులు కేసు నమోదు చేశారు. మంగ్లి ఇటీవల తన పుట్టిన రోజు వేడుకలను చేవెళ్లలోని త్రిపుర రిసార్ట్‌లో జరుపుకున్నారు, ఇది వివాదాస్పదంగా మారింది. ఈ పార్టీలో విదేశీ మద్యం మరియు గంజాయి వినియోగం జరిగినట్లు ఆరోపణలు రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. దామోదర్ అనే వ్యక్తి గంజాయి సేవిస్తూ పట్టుబడ్డాడని, మంగ్లితో సహా 9 మందిపై కేసు నమోదైందని సోషల్ మీడియా పోస్ట్‌లలో పేర్కొన్నారు.
Also Read:Tollywood: రేపు సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యే సినీ ప్రముఖుల లిస్ట్ ఇదే!
ఇక తెలంగాణ ప్రభుత్వం నిర్వహించే గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్, 2014 నుంచి 2024 వరకు విడుదలైన చిత్రాల్లో ఉత్తమ ప్రతిభను గుర్తించి సత్కరించే వేదికగా నిలిచింది. ఈ సంవత్సరం ఉత్తమ చిత్రంగా కల్కి 2898 ఏడీ, ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ (పుష్ప 2), ఉత్తమ నటిగా నివేదా థామస్ (35 చిన్న కథ కాదు) ఎంపికయ్యారు. జ్యూరీ ఛైర్‌పర్సన్‌గా నటి జయసుధ వ్యవహరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమక్షంలో అవార్డులు అందజేయబడ్డాయి. గద్దర్ స్మారక మొమెంటో, డప్పు – రీల్‌తో రూపొందిన డిజైన్‌తో అవార్డు సిద్ధం చేశారు.