సినిమా హిట్ అవ్వాలి అంటే కోట్లు పెట్టక్కర్లేదు.. కంటెంట్ ఉంటే చాలు అని రుజువు చేసిన చిత్రం ‘టూరిస్ట్ ఫ్యామిలీ’. తాజాగా కోలివుడ్ నుండి వచ్చిన ఈ సూపర్ హిట్ చిత్రం కేవలం రూ. 8 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి.. రూ.90 కోట్ల వసూళ్లను సాధించింది. ప్రస్తుతం ఈ చిత్రం జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. నటులు శశికుమార్, సిమ్రాన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీలో యోగి బాబు, మిథున్ జై శంకర్, కమలేష్ జెగన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్క ప్రేక్షకులు ప్రశంసలు కురిపించారు. తలైవర్ రజనీకాంత్‌తో పాటు నటుడు శివకార్తికేయన్, ధనుష్, ఎస్.ఎస్ రాజమౌళి, సూర్య సినిమాపై ప్రశంసలు కురిపించారు.. అయితే తాజాగా
Also Read : Kalpika : సినీ నటి కల్పికపై మరో కేసు నమోదు
ఈ మూవీ దర్శకుడు అభిషన్ జీవింత్ టాలీవుడ్ నటుడు నేచురల్ స్టార్ నానిని కలుసుకున్నాడు. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా ప్రత్యేక పోస్ట్ పెట్టాడు.. ‘ఈ రోజు నిజంగా అద్భుతమైన రోజు. మిమ్మల్ని కలవడం నిజంగా గౌరవంగా భావిస్తున్నాను నాని సర్. మీరు చాలా వినయంగా, ఒదిగి ఉండే మనిషి. నా ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ సినిమా గురించి మీరు అంత వివరంగా మాట్లాడిన తీరు నాకు మరింత ప్రత్యేకంగా అనిపించింది’ అంటూ అభిషన్ జీవింత్ రాసుకొచ్చాడు.