టీ20 వరల్డ్ కప్ 2024 సూపర్-8 మ్యాచ్లు ఈరోజు ప్రారంభమయ్యాయి. వెస్టిండీస్-అమెరికా మ్యాచ్ తో షురూ అయ్యాయి. సూపర్-8లోని గ్రూప్ 2లో ఇప్పటివరకు రెండు మ్యాచ్లు జరిగాయి. తొలి మ్యాచ్లో దక్షిణాఫ్రికా-అమెరికా జట్లు తలపడగా.. రెండో మ్యాచ్లో ఇంగ్లండ్, ఆతిథ్య వెస్టిండీస్ తలపడ్డాయి. కాగా.. తొలి మ్యాచ్లో సౌతాఫ్రికా గెలువగా.. రెండో మ్యాచ్లో ఇంగ్లండ్ విజయం సాధించింది. దీంతో.. ప్రస్తుతం రెండు జట్లు చెరో 2 పాయింట్లతో టాప్ ప్లేస్లో ఉన్నాయి.
Read Also: Pavithra Ex Husband: దర్శన్ భార్య విజయలక్ష్మిపై పవిత్ర గౌడ మాజీ భర్త సంజయ్ సింగ్ ఫిర్యాదు?
సూపర్-8 గ్రూప్ 2 పాయింట్ల పట్టికను పరిశీలిస్తే.. ఇంగ్లాండ్ అగ్రస్థానంలో ఉంది. దక్షిణాఫ్రికా కంటే నెట్ రన్ రేట్ మెరుగ్గా ఉంది. మరోవైపు.. అమెరికా మూడో స్థానం, వెస్టిండీస్ నాలుగో స్థానంలో ఉంది. మరోవైపు.. సూపర్-8 గ్రూప్ 1 మ్యాచ్ లు ఈరోజు నుంచి ప్రారంభం కానున్నాయి. తొలి మ్యాచ్ భారత్-అప్ఘనిస్తాన్ మధ్య జరుగనుంది. ఆ తర్వాత.. రెండో మ్యాచ్ ఆస్ట్రేలియా-బంగ్లాదేశ్ మధ్య జరుగనుంది. రెండు గ్రూప్ల్లో టాప్ 2లో నిలిచిన జట్లు సెమీ ఫైనల్కు చేరుకుంటాయి.
Read Also: AP Assembly: ఏపీ అసెంబ్లీ సమావేశాల వేళ కీలక నిర్ణయం.. వారికి కూడా నో ఎంట్రీ..