కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..అద్భుతమైన టేకింగ్ తో శంకర్ తెరకెక్కించే సినిమాలు ఎంతో అద్భుతంగా ఉంటాయి..ఇండియన్ సినిమా చరిత్రలో శంకర్ కి దర్శకుడి గా ప్రత్యేక స్థానం వుంది. ప్రస్తుతం ఆయన విశ్వనటుడు కమల్ హాసన్ తో “భారతీయుడు 2” మూవీని అలాగే గ్లోబల్ స్టార్ రాంచరణ్ తో “గేమ్ చేంజర్” సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ రెండు సినిమాలు ప్రస్తుతం విడుదలకు సిద్ధం అవుతున్నాయి.. ఇదిలా ఉంటే శంకర్ పెద్ద కుమార్తె ఐశ్వర్య పెళ్లి విషయం ప్రస్తుతం వైరల్ అవుతుంది.తన అసిస్టెంట్ డైరెక్టర్ తరుణ్ కార్తీక్ తో శంకర్ పెద్ద కుమార్తె ఐశ్వర్య నిశ్చితార్థం చెన్నైలో ఘనంగా జరిగింది.అయితే డాక్టర్ అయిన ఐశ్వర్యకు ఇది రెండో వివాహం.
2021లో క్రికెటర్ రోహిత్‌ను ఆమె పెళ్లి చేసుకున్నారు. తర్వాత అతనితో విడాకులు తీసుకున్నారు. అప్పట్లో రోహిత్‌పై వచ్చిన ఆరోపణలు కారణంగానే ఆమె విడిపోయినట్లు కోలీవుడ్ వర్గాల్లో ప్రచారం సాగింది. అయితే ప్రస్తుతం తరుణ్ కార్తీక్.. శంకర్ సినిమాలకూ సహాయ దర్శకుడిగా పనిచేస్తున్నారు.ఇదిలా ఉంటే తాజాగా శంకర్ పెద్ద కుమార్తె ఐశ్వర్య, తరుణ్ కార్తీక్ వివాహం ఎంతో ఘనంగా జరిగింది. వీరిద్దరి ఆశీర్వదించదానికి కోలీవుడ్ సినీ ప్రముఖులు హాజరయ్యారు. అలాగే తమిళనాడు ముఖ్య మంత్రి స్టాలిన్ ఈ వివాహానికి హాజరయి వధూవరులను ఆశీర్వదించారు.అలాగే ఈ వివాహానికి కోలీవుడ్ సినీ ప్రముఖులు హాజరు అయ్యారు..కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్, చియాన్ విక్రమ్, సూర్య, కార్తీ, మణి రత్నం, సుహాసిని దంపతులు ఈ వివాహానికి హాజరు అయ్యి నూతన వధూవరులను ఆశీర్వదించారు..