కబీర్ సింగ్ తర్వాత షాహీద్ కపూర్ ఆ రేంజ్ హిట్ చూడలేదు. సందీప్ రెడ్డి వంగా ఫిల్మ్ తర్వాత చేసినవే తక్కువ సినిమాలు అందులో హిట్స్ కూడా ఫింగర్ టిప్స్‌పై లెక్కించొచ్చు. తేరీ బాతోం మే ఐసా ఉల్జా జియాతో హిట్ తర్వాత కాస్త రూట్ మార్చి దేవా అంటూ యాక్షన్ మూవీతో ముందుకొచ్చాడు. లవర్ బాయ్ ఇమేజ్ నుండి ఛేంజ్ అవ్వాలని ట్రై చేశాడు కానీ బొమ్మ బాక్సాఫీస్ బాంబ్‌గా మారడంతో శ్రమ అంతా వృథా అయ్యింది.
Also Read : The Dadasaheb Phalke biopic : మళ్లీ తెరపైకి రాజ్ కుమార్ హిరానీ- అమీర్ ఖాన్ ‘దాదా సాహెబ్ ఫాల్కే’ బయోపిక్..
షాహీద్ నెక్ట్స్ ‘ఓ రోమియో’ అంటూ ఫిబ్రవరి 13న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. రోమియో అంటే ఏదో లవర్ బాయ్‌లా కనిపిస్తాడనుకునేరు. ఫుల్ మాస్ యాంగిల్ చూపించబోతున్నాడు. దేవా కన్నా వయలెంట్‌గా .. రగుడ్ లుక్ లోకి మేకోవర్ అయ్యాడు కబీర్ సింగ్. కౌబాయ్‌గా సంథింగ్ డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తున్నాడు షాహీద్. తొలుత అర్జున్ విస్తారా టైటిల్ ఫిక్స్ చేయగా.. , ఆ తర్వాత ఓ రోమియోగా ఛేంజ్ చేశారు. ఈ రోమియోకు జూలియట్‌గా నటిస్తోంది త్రిప్తి దిమ్రీ. దిశా పటానీ, తమన్నా, విక్రాంత్ మాస్సే, నానా పటేకర్ కీ రోల్స్ పోషిస్తున్నారు. ఓ రోమియోలో షాహీద్‌లో గ్యాంగ్ స్టర్ కమ్ రొమాంటిక్ యాంగిల్ చూపించబోతున్నాడు విశాల్ భరద్వాజ్. ఈ ఇద్దరి కాంబోలో వస్తున్న ఫోర్త్ ఫిల్మ్ కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. గతంలో కమీనే, హైదర్ హిట్స్‌గా నిలవగా.. రంగూన్ ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. మళ్లీ తొమ్మిదేళ్ల తర్వాత ఈ కాంబో రిపీట్ అవుతోంది. ఇక దేవాతో మాస్ హీరోగా ఫ్రూవ్ చేసుకోలేకపోయిన షాహీద్.. ఓ రోమియోతో రొమాంటిక్ విత్ యాక్షన్ హీరోగా సక్సెస్ అందుకుంటాడేమో చూడాలి.