ఇండోనేషియాను భారీ భూకంపం హడలెత్తించింది. సుమత్రా ద్వీపంలో 6.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. 10 కి.మీ లోతులో భూకంపం సంభవించిందని.. సునామీ వచ్చే అవకాశం లేదని జియోఫిజిక్స్ ఏజెన్సీ తెలిపింది.
Srisailam Ghat Road: ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో మరోసారి భారీ వర్షాలు కురుస్తున్నాయి.. దీంతో, భక్తులు ఇబ్బంది పడుతున్నారు.. శ్రీశైలం రాకపోకలు సాగించే భక్తులు అప్రమత్తంగా ఉండాల్సిన సమయం వచ్చింది.. శ్రీశైలం-హైదరాబాద్ ఘాట్ రోడ్డులో భారీ స్థాయిలో కొండచరియలు విరిగిపడుతున్నాయి.. ఉదయం నుంచి శ్రీశైలంలో భారీ వర్షం కురుస్తోంది.. ఈ వర్షానికి శ్రీశైలం – హైదరాబాద్ ఘాట్‌రోడ్డులోని డ్డయమ్, స్విచ్ యార్డ్ సమీపంలో ఒక్కసారిగా పెద్ద పెద్ద కొండ చరియలు, బండరాళ్లు, చెట్లు విరిగి రోడ్డుపై అడ్డుగా…
ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌లలో వరద ఉద్ధృతి కొనసాగుతోంది. వరదల కారణంగా కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఇప్పటికే పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. ఉప్పొంగుతున్న నదులు, భారీ వర్షాల కారణంగా అనేక ప్రాంతాలను విపత్తు అంచుకు నెట్టివేస్తున్నాయి. దీంతో రెండు రాష్ట్రాలు యంత్రాంగాలు అప్రమత్తమయ్యాయి.
Tirumala Landslides: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో తిరుమలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో తిరుమల తిరుపతి దేవస్థానం అప్రమత్తమైంది.
ప్రకృతి విలయంతో వయనాడ్ కకావికలం అయింది. ఊహించని విపత్తుతో ఆప్తుల్ని కోల్పోవడంతో పాటు ఆస్తుల్ని పోగొట్టుకుని దు:ఖ సముద్రంలో ఉన్న బాధితులకు ప్రధాని మోడీ అండగా నిలిచారు. వారి కష్టాలను, బాధలను తెలుసుకుని చలించిపోయారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
జులై 30న వయనాడ్ జిల్లా మెప్పాడి సమీపంలోని వివిధ కొండ ప్రాంతాలలో సంభవించిన కొండచరియలు భారీ వినాశనానికి కారణమయ్యాయి. ఈ ప్రకృతి విపత్తు కారణంగా 300 మందికి పైగా మరణించారు.
కేరళ విలయంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాజ్యసభలో స్పందించారు. వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడగానికి వారం రోజుల ముందే కేరళలోని పినరయ విజయన్ ప్రభుత్వాన్ని హెచ్చరించినట్లు అమిత్ షా స్పష్టం చేశారు.
Huge Landslides Strike in Wayanad: కేరళలోని వాయనాడ్ జిల్లా మెప్పాడి సమీపంలోని పలు కొండ ప్రాంతాల్లో ప్రమాదం చోటుచేసుకుంది. మంగళవారం తెల్లవారుజామున భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో వందలాది మంది చిక్కుకున్నట్లు తెలుస్తోంది. కేరళ స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (కేఎస్‌డీఎంఎ) బాధిత ప్రాంతాలకు ఫైర్‌ఫోర్స్, ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలను పంపి సహాయక చర్యలు చేపట్టింది. అదనపు ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందం కూడా వాయనాడ్‌కు వెళుతున్నట్లు సమాచారం. కన్నూర్ డిఫెన్స్ సెక్యూరిటీ కార్ప్స్ బృందాలు కూడా రెస్క్యూ…