మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మజ్‌గవాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నుంజ ఖమ్‌హారియా గ్రామ సమీపంలో ట్రక్కు ఆటోను బలంగా ఢీకొట్టి.. అనంతరం ఆటోపై బోల్తాపడింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న వారిలో ఏడుగురు మృతి చెందారు. అందులో ఒక చిన్నారి కూడా ఉంది. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
కర్ణాటకలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కొండచరియలు విరిగిపడి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు మృతి చెందారు. అయితే.. కర్నాటకలోని పలు ప్రాంతాల్లో గత రెండ్రోజులుగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో భారీ వరదలు, కొండచరియలు విరిగిపడుతుండటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా.. ఉత్తర కన్నడ జిల్లా శిరూర్‌లో మంగళవారం వాహనాలు ప్రయాణిస్తున్న రోడ్డుపై భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు.
సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం కోసం రకరకాల వీడియోలు చేస్తూ.. పోస్ట్ చేస్తున్నారు. కొన్ని వీడియోలలో రకరకాల స్టంట్స్ చేస్తూ.. హైలెట్గా నిలుస్తున్నారు. అయితే.. యూపీలోని హాపూర్ జిల్లాలో ఓ వ్యక్తి చేసిన పనికి ట్రాఫిక్ పోలీసులు భారీ జరిమానా విధించారు. ఇంతకీ అతను ఏం చేశాడంటే....
గుజరాత్లో తీవ్ర విషాదం నెలకొంది. పోయిచా గ్రామాన్ని సందర్శించేందుకు వచ్చిన ఆ ఏడుగురిని మృత్యువు వెంటాడింది. మంగళవారం నర్మదా నదిలో ఆరుగురు బాలురుతో పాటు ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. కాగా.. అది చూసిన స్థానికులు భయంతో అరుపులు, కేకలు వేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నర్మదా నదిలో స్నానం చేసేందుకని అందులోకి దిగారని, అయితే లోతు ఎక్కువగా ఉండటంతో అందులో మునిగిపోయినట్లు చెబుతున్నారు. కాగా.. వారి ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.
ఖమ్మం జిల్లాలో మున్నేరు వరదలో చిక్కుకున్న ఏడుగురి కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందం రంగంలోకి దిగింది. సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్న మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు సీఎం కేసీఆర్ ఫోన్ చేశారు. మున్నేరు వరద ఉధృతి, సహాయక చర్యలపై మంత్రి పువ్వాడని అడిగి సీఎం కేసీఆర్ తెలుసుకున్నారు.