వ్యవసాయం చేసే రైతులు కేవలం పంటలను మాత్రమే కాదు చేపలను కూడా పెంచుతున్నారు.. చేపల పెంపకం ఉపాదికి చక్కటి మార్గం. వీటి పెంపకంలో అధిక దిగుబడి రావాలంటే చేప పిల్లల ఎంపిక, నీటి నాణ్యత, ఎరువులు, మేత, ఆరోగ్య యాజమాన్య పద్ధతులను విధిగా పాటించాలి..
చేపల పిల్లలను ఎంపిక చేసుకోవడంలో తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.. 3 రకాల చేప పిల్లలను 2 మీటర్లలోతుండే చెరువులో ఎకరా నీటి విస్తీర్ణానానికి 2 వేల వరకు వదలాలి.2-4 అంగుళాల సైజు కలిగి చురుకుగా, ఆరోగ్యంగా ఉన్న చేప పిల్లల్ని ఎంచుకోవాలి. దాణా పెట్టే ప్రత్యేక చెరువుల్లో ఎకరాకు 3 వేల పిల్లల్ని వేసుకోవచ్చు. నాచు ఎక్కువగా పెరిగే చెరువుల్లో ఎకరాకు 100-150 గడ్డి చేపపిల్లల్ని వేసుకోవడం మంచిది. మిశ్రమ పెంపకంలో చేపలతో పాటుగా రొయ్యలు పెంచుకుంటే అధిక లాభాలను పొందవచ్చు..
ఇక చెరువును సారవంతం చేసి, సహజ ఆహారం ఉత్పత్తికి గాను నెలకొకసారి ఎకరానికి 500కి. కోళ్ల పెంట, లేదా 1000 కి.పశువుల ఎరువు,8 కి. యూరియా, 20 కి. సూపర్ ఫాస్ఫేట్,3 కి పోటాష్ చొప్పున చేరువంతా చల్లాలి. సేంద్రియ, రసాయన ఎరువుల్ని 15 రోజుల తేడాతో ఒకటి వేసుకున్నాక మరొకటి వేసుకోవాలి..
చేపలు బాగా ఆరోగ్యంగా ఉండాలంటే మేత తయారీకి నాణ్యమైన దినుసులు వాడాలి.. అంటే వేరు సెనగ , ప్రత్తి, చెక్క, ఖనిజలవణాలు మిశ్రమం తగు మోతాదుల్లో వాడాలి. ఎకరాకు 5-10 మేత సంచులను సూర్యోదయం తరువాతనే కట్టాలి..
చేపల ఆరోగ్యం చాలా ముఖ్యం.. అందుకే 20 రోజులకొకసారి ట్రయల్ నెట్టింగ్ చేసి కొన్ని చేపల్ని పట్టి పెరుగుదలను, ఆరోగ్యాన్ని పరిశీలించి వివరాలను రిజిస్టర్ లో నమోదు చేయాలి. చేపల్లో సూక్ష్మ జీవులు, పరాన్నా జీవుల వల్ల వచ్చే వ్యాధులను సకాలంలో గుర్తించి నివారణ చేయాలి.. వీలైతే నిపుణుల సలహా మేరకు తగిన మందులను కూడా వాడటం మంచిది..
బాగా పెరిగిన చేపలను సకాలంలో పట్టుబడి చేసి, సైజుల వారిగా గ్రేడింగ్ చేసి గిట్టుబాటు ధరకు మార్కెటింగ్ చేసుకోవాలి. చేప కిలో సైజు పెరగడానికి 12 నేలలు పడుతుంది.. అయితే చేపలను పట్టి వాటిని వెదురు, లేదా థర్మాకోల్ లో ఐస్ వేసి మార్కెటింగ్ చెయ్యాలి అప్పుడే అవి పాడవ్వవు.. మంచి లాభాలను పొందవచ్చు..