అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని 8 మండలాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో 30 పాఠశాలకు సెలవు ప్రకటించారు అధికారులు. పలుచోట్ల పాఠశాలల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. అయితే.. ఇటీవల ఏపీలో కురిసిన వర్షాలకు ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. అయితే.. లోతట్టు ప్రాంతాల ప్రజలు పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. అయితే.. భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో పలువురు వరదల్లో చిక్కుకున్నారు. వారిని ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు కాపాడాయి. గోదావరి నది ఉగ్రరూపం దాల్చడంతో ఈ పరిస్థితి తలెత్తినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం రాకపోకలు పడవలపై చేయాల్సిన పరిస్థితి కూడా కోనసీమలో కొన్ని ప్రాంతాల్లో దాపురించింది.
Also Read : Russia Ukraine War: ఉక్రెయిన్ పైచేయి సాధిస్తే, మేం అణ్వాయుధం వినియోగిస్తాం.. దిమిత్రి హెచ్చరిక
ఒకసారి జిల్లాలో ఆప్రాంతాలు ఎక్కడ ఉన్నాయి. అంతకంత రోజుకి గోదావరి నీటిమట్టం పెరుగుతున్న నేపథ్యంలో కోనసీమ జిల్లాకు సంబంధించి అల్లవరం మండలం బోడసకురు పల్లిపాలెంలో వరద ఉధృతి విపరీతంగా పెరుగుతుంది. పల్లపు ప్రాంతాల్లో ఇప్పటికి నివాసాలకు సైతం నీరు చొరబడింది. ప్రధాన రహదారులపై నాలుగు అడుగుల మేర నీరు పొంగి పొర్లడంతో ఆ ప్రాంతాన్ని ముఖ్యంగా ఆ నివాసాల్లో ఉంటున్న ప్రజలంతా కూడా ఖాళీ చేసి పునరావస కేంద్రాలకు పయనమయ్యారు. దాదాపు 100కు పైగా నివాసాల్లో నీరు చేరిన పరిస్థితి ఆ ప్రాంతంలో కనిపిస్తుంది. అధికారి యంత్రాంగమంతా కూడా పడవలపైనే రాకపోకలు కొనసాగిస్తున్నారు. ఇక అత్యవసరం రీత్యా అటూ ఇటూ తిరగవలసిన ప్రజల సైతం పడవ పైనే వెళ్లాల్సిన పరిస్థితి దాపురించింది.
Also Read : Amazon Smart Watch Offers 2023: అమెజాన్‌లో 80 శాతం తగ్గింపు ఆఫర్.. రూ. 1399కే స్మార్ట్ వాచ్! రూ. 5600 ఆదా