Buy BeatXP Marv Neo Smart Watch Just Only Rs 899 in Amazon Great Freedom Festival Sale 2023: ఆన్‌లైన్ ఈ-కామర్స్ సంస్థ ‘అమెజాన్’ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ 2023 సేల్‌ను నిర్వహించబోతోంది. అమెజాన్ ఇండియా ఈ సేల్‌ను ఆగస్టు 5 నుంచి 9 వరకు నిర్వహిస్తోంది. 5 రోజుల పాటు జరిగే ఈ సేల్‌లో అన్ని వస్తువులపై భారీగా ఆఫర్లు ఉండనున్నాయి. అయితే సేల్ ఆరంభానికి ముందే కొన్నింటిపై అమెజాన్ ఆఫర్ల వివరాలను వెల్లడిస్తోంది. ముఖ్యంగా స్మార్ట్ వాచ్‌లపై భారీ ఆఫర్లు ఉంటాయని అమెజాన్ ఇండియా ప్రకటించింది.
బీట్‌ఎక్స్‌పీ మార్వ్ నియో (beatXP Marv Neo Smartwatch) స్మార్ట్ వాచ్‌పై భారీ డిస్కౌంట్‌ను అమెజాన్ ఇండియా ప్రకటించింది. గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ 2023 సేల్‌లో ఈ స్మార్ట్ వాచ్‌పై ఏకంగా 80 శాతం డిస్కౌంట్ ఇచ్చింది. దాంతో ఈ వాచ్‌ను కేవలం రూ. 1399కే సొంతం చేసుకోవచ్చు. ఈ వాచ్ అసలు ధర రూ. 6,999గా ఉంది. అంటే మీరు రూ. 5,600 ఆదా చేసుకోవచ్చు. అయితే సేల్ సమయంలో ఈ వాచ్ ధర మరింత తగ్గనుందని తెలుస్తోంది. మరో రూ. 500 తగ్గింపుతో కేవలం రూ. 899కే బీట్‌ఎక్స్‌పీ మార్వ్ నియో స్మార్ట్ వాచ్‌ను సొంతం చేసుకోవచ్చు. ఈ వాచ్‌లో బ్లూటూత్ కాలింగ్, స్మార్ట్ ఏఐ వాయిస్ అసిస్టెంట్, వందకు పైగా స్పోర్ట్స్ మోడ్స్, SpO2 మానిటరింగ్ లాంటి ఫీచర్లు ఉన్నాయి.
Also Read: Support Moranchapalli: దయనీయ స్థితిలో మోరంచపల్లి వాసులు.. ఆపన్న హస్తం కోసం ఎదరుచూపు
బీట్‌ఎక్స్‌పీ మార్వ్ రేజ్ (beatXP Marv Raze Smartwatch) స్మార్ట్ వాచ్‌పై 79 శాతం డిస్కౌంట్‌ను అమెజాన్ ఇండియా ప్రకటించింది. అప్పుడు ఈ వాచ్ రూ. 1,599కి మీకు అందుబాటులో ఉంటుంది. ఇక ఫైర్-బోల్ట్ నింజా కాల్ ప్రో ప్లస్ (Fire-Boltt Ninja Call Pro Plus) స్మార్ట్ వాచ్‌పై 25 శాతం తగ్గింపు ఉంది. ఫైర్-బోల్ట్ నింజా సాలు ధర రూ. 1,999 కాగా.. రూ. 500 తగ్గింపుతో రూ. 1,499కే కొనుగోలు చేయొచ్చు. గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ 2023 సేల్ సమయంలో ఎస్‌బీఐ కార్డుపై 10 శాతం డిస్కౌంట్‌ను అమెజాన్ ఇండియా ప్రకటించింది. స్మార్ట్ వాచ్ కొనాలనుకునేవారికి ఈ సేల్ మంచి ఆప్షన్ అని చెప్పాలి.