సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్బంగా తెలంగాణ పోలీస్ విభాగం ఆధ్వర్యంలో ‘ఎక్త దివాస్’ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, తెలంగాణ డిజిపి శివధర్ రెడ్డి, నగర సిపి సజ్జనర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరు మాట్లాడుతూ ‘సర్దార్ దృఢ సంకల్పం, విజన్, కార్యదీక్షత అందరికి ఆదర్శనీయం. 560 ముక్కలైన దేశాన్నిఒక్కటి చేసిన గొప్ప వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్. వన్ నేషన్ ని పటేల్ మనకు అందించిన ఇచ్చిన వరం. యూనిటీ ఆఫ్ డైవర్సిటీ అంటూ వల్లభాయ్ పటేల్ ఇచ్చిన సందేశం. హైదరాబాద్ లో ఈ కార్యక్రమాన్ని పోలీసులు నిర్వహించడం ఆనందంగా ఉంది. నాకు ఈ కార్యక్రమం లో పాల్గొనే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు. ఇలాంటి కార్యక్రమాలు తరచూ చేయాలని ఆశిస్తున్నాను అని అన్నారు.
Also Read : Republic : సాయి దుర్గ తేజ్.. దేవా కట్ట.. రిపబ్లిక్ – పార్ట్ 2
డిప్ ఫేక్ పై స్పందిస్తూ ‘తెలంగాణా పోలీసు వ్యవస్థ చాలా బలంగా ఉంది. ప్రజలకు పోలీసులు అండగా ఉన్నారు. ఏ ఆపద వచ్చిన వారికీ తోడుగా రక్షణ కల్పిస్తున్నారు. ఇటీవల కొందరు నా ఫోటోలను డీప్ ఫేక్ చేసి అశ్లిల వీడియోలు, ఫోటోలు సృష్టించారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయగా వెంటనే స్పందించి చర్యలు తీసుకున్నారు. డీప్ ఫేక్ అనేది పెద్ద గొడ్డలి పెట్టు లాంటిది. ఇప్పటికే ఈ అంశాన్ని పోలీసుల దృష్టికి తీసుకువెళ్ళాను. డీజీపీ..హైదరాబాద్ సిపి సజ్జనార్ లు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు. ఈ కేసును సిపి సజ్జనార్ స్వయంగా పర్యవేక్షస్తున్నారు. ఎవరూ డీప్ ఫేక్, సైబర్ నేరాలకు భయపడాల్సిన అవసరం లేదు. పెరుగుతున్న టెక్నాలజీ ని ఆహ్వానించాలి, కానీ దాని వల్ల ముప్పు కూడా ఉంది. ప్రభుత్వాలు కూడా దీని పై ప్రత్యేక చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉంది. లేదంటే భవిష్యత్ లో మరిన్ని ఇబ్బందులు ఎదురుకునే అవకాశం ఉంటుంది.’ అని అన్నారు. అనతరం నిర్వహించిన 2K ను జెండా ఊపి ప్రారంభించారు మెగాస్టార్.