Hyderabad: సంక్రాంతి పండుగను పురస్కరించుకుని నగరవాసులు బంధువుల ఇళ్లకు, ఊర్లకు వెళ్లిన సమయంలో దొంగల ముఠా రెచ్చిపోయింది. హైదరాబాద్ మేడిపల్లి పరిధిలోని చెంగిచెర్ల కాలనీలో తెల్లవారుజామున 2:30 గంటల సమయంలో దొంగలు వరుస చోరీలకు పాల్పడ్డారు. ఒకే రాత్రిలో 13 ఇళ్లను టార్గెట్ చేసి భారీ చోరీలు చేయడంతో స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి.
పోలీసుల సమాచారం ప్రకారం ముందుగానే రెక్కీ నిర్వహించిన దొంగల ముఠా కారులో కాలనీలోకి వచ్చి, చేతిలో కత్తులతో సంచరిస్తూ ఇళ్ల తలుపులు, అల్మారాల లాక్స్‌ను పగులగొట్టి చోరీలకు పాల్పడింది. పలు ఇళ్లలో బంగారం, వెండి, నగదును ఎత్తుకెళ్లిన అనంతరం దొంగలు అక్కడి నుంచి పరారయ్యారు.
Snapdragon 8 Gen 5, 200MP కెమెరా, 7600mAh బ్యాటరీతో iQOO Z11 Turbo లాంచ్.. ధర ఎంతంటే..?
NTVతో మాట్లాడిన బాధితులు తమ ఇళ్లలో భారీ నష్టం జరిగినట్లు వాపోయారు. ఒక బాధితుడు మాట్లాడుతూ.. “తన ఇంట్లో 10 తులాల బంగారం, 10 తులాల వెండి, రూ.15 వేల నగదు పోయాయి. కొడుకు ఇంటికి వెళ్లి తిరిగి వచ్చేసరికి మెయిన్ డోర్, అల్మారా లాక్స్ పగిలి ఉన్నాయి. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాం” అని తెలిపారు. మరో బాధితుడు ఇంట్లో కూడా ఇదే తరహాలో ఇళ్లలోకి చొరబడి చోరీ చేశారని చెప్పారు. సమాచారం అందుకున్న వెంటనే మేడిపల్లి పోలీసులు, క్లూస్ టీమ్ ఘటన స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్‌ల ఆధారంగా దొంగల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.