Samantha: ఏం మాయ చేశావే తో ప్రేక్షకులను మాయచేసేసింది సమంత. వరుస హిట్లు కొట్టేసి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. కెరీర్ పీక్స్ లో ఉండగానే నాగచైతన్య ప్రేమించి వివాహం చేసుకుంది. కొన్ని కారణాల వల్ల ఇద్దరిమధ్య విబేధాలు వచ్చి విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటోంది సమంత. చైతుతో విడిపోయిన తర్వాత తన దృష్టి అంతా సినిమాలపైనే పెట్టింది. వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ సినిమాల్లో నటిస్తోంది. ఓవైపు స్టార్ హీరోల సినిమాలలో నటిస్తూనే ఇంకొక వైపు హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తుంది. తాజాగా శాకుంతలం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా డిజాస్టర్ కావడంతో తన దృష్టిఅంతా తన నెక్ట్స్ మూవీపై పెట్టింది.
Read Also :AP CM Jagan Tour: నేడు గుంటూరులో సీఎం జగన్ పర్యటన.. రేపు కొవ్వూరుకు ముఖ్యమంత్రి
ప్రస్తుతం ఆమె విజయ్ దేవరకొండ సరసన ఖుషీ సినిమాలో నటిస్తోంది. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమా విడుదలక రెడీ అవుతోంది. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా సమంత వరస పెట్టి సినిమాలను చేస్తుంది. అక్కడి జనాలను ఆకర్షించేందుకు పలు రకాల ప్రయత్నాలను చేస్తుంది. ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ లో కీలక పాత్రలో నటించిన ఈమె తాజాగా హాలీవుడ్లో ప్రియాంక నటించిన సీటాడెల్ ఇండియన్ వర్షన్లో నటిస్తోంది. ఇప్పటిదాకా ఎక్కువగా బోల్డ్ సన్నివేశాలలో నటించకుండా స్టార్ హీరోయిన్ గా ఎదిగిన సమంత ఈ సినిమాలో శృంగార సన్నివేశాలలో కూడా నటించడానికి ఒప్పుకుందంట. ఈ సినిమాలో వరుణ్ ధావన్ కి జంటగా ఆమె కనిపించబోతుండగా వీరి మధ్య చాలా లిప్ లాకులు ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది.
Read Also :Sarath Babu : నేడు చెన్నైలో శరత్ బాబు అంత్యక్రియలు
ఇవన్నీ ఇప్పుడు ఆమె చేయడానికి సిద్ధమయ్యింది అన్నట్లుగా ప్రచారం జరుగుతుంది. ఇప్పటిదాకా చాలా రొమాంటిక్ సీన్స్ చేసిన ఈ ముద్దుగుమ్మ ఈ సినిమాలో అంతకుమించిన రొమాంటిక్ సీన్స్ లో పాల్గొన పోతుందట. మరి ఈ వెబ్ సిరీస్ లో సమంత పాత్ర ఏ విధంగా ఉండబోతుంది దానిని ప్రేక్షకులు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు అనే విషయం తెలియాలి అంటే ఈ వెబ్ సిరీస్ బయటకు వచ్చేంత వరకు వేచి చూడాల్సిందే.