సైకిల్ అంటే ఎలా ఉంటుంది.. రెండు పెద్ద చక్రాలు.. వాటిని అటాస్ చేస్తూ ఫ్రేమ్-చైన్ అంతేకదా.. మనకు తెలిసిన సైకిల్.. సైకిల్ అనే కాదు.. ఏ వాహనానికైనా ఇంచుమించు గుండ్రని టైర్లు, చక్రాలు అలాగే ఉంటాయి. అలా కాకుండా సైకిల్ కు చతురస్రాకారంలో ఉండే టైర్లు ఉంటే.. అలా సింపుల్ గా తొక్కేసుకుంటూ వెళ్లిపోగలిగితే.. అదెలా సాధ్యమనిపిస్తోంది కాదా.. అయితే రష్యాకు చెందిన ది క్యూ సంస్థ ఇంజనీర్ సెర్గీ గోర్డీన్ మాత్రం దీనిని చేసి చూపించాడు.
Read Also : Bihar Spurious Liquor : కల్తీ మద్యం సేవించి ఐదుగురు మృతి.. 12 మంది పరిస్థితి విషమం
చతురాస్రాకారంలో టైర్లను రూపొందించి.. సాధారణ సైకిల్ ఫ్రేమ్ కు అమర్చి నడిపించాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. యుద్ద ట్యాంకుల చక్రాల్లో వాడే టెక్నాలజీని స్వ్యేర్ టైర్ సైకిల్ లో వినియోగించారు. సింపుల్ గా.. చెప్పాలంటే.. ఇందులో చక్రాలు మొత్తానికి మొత్తంగా తిరగవు.. జస్ట్ వాటి అంచున ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన బెల్ట్ మాత్రమే కదులుతుంది. అలాగే స్వ్యేర్ వీల్ చతురస్రాకారపు వీల్స్ కదలకుండా అలాగే ఉంటాయి.
Read Also : Natasha Bhardwaj :ఆలూబిర్యానీ ఆర్డర్ చేస్తే.. చికెన్ బిర్యానీ పంపించారు..
సెర్గీ గోర్డీన్ ప్రత్యేకమైన బెల్ట్ ను తయారు చేసి వాటి అంచులో అమర్చాడు. పెడల్స్ తొక్కినప్పుడు ఆ బెల్ట్ ముందుకు కదిలేలా.. గేర్లను, చైన్ లను అమర్చి వాటికి అనుసంధానించాడు. ఇక పెడల్ ను తొక్కినప్పుడు.. ఆ బెల్ట్ కూడా కదులుతూ.. సైకిల్ ముందుకు వెళుతుంది. ఇదో వినూత్న ఆలోచన.. చాలా బాగుందని కొందరు నెటిజన్లు ప్రశంసిస్తుంటే.. అంతా బాగానే ఉందిగానీ.. స్పీడ్ బ్రేకర్లు గుంతలు వస్తే పరిస్థితి ఏమిటన్న కామెంట్స్ వస్తున్నాయి. అప్పుడు ఏం చేయాలి అంటూ సెర్గీ గోర్డీన్ కు ప్రశ్నలు సందిస్తున్నారు.