ROHIT SHARMA : రోహిత్ శర్మ క్లీన్ బౌల్డ్.. తొండాట ఆడిన సంజూ శాంసన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బర్త్ డే రోజున ఐపీఎల్ లో ఎప్పుడూ 20 పరుగులు కూడా చేయలేకపోయాడు రోహిత్ శర్మ. 2009లో డెక్కన్ ఛార్జర్స్ హైదరాబాద్ తరపున పుట్టిన రోజున జరిగిన మ్యాచ్ లో 20 బంతుల్లో 17 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇప్పటికీ రోహిత్ బర్త్ డేన అదే అత్యధిక స్కోర్.. 2014లో ఐదు బంతులాడి కేవలం 1 పరుగు చేసిన రోహిత్ శర్మ.. 2022లో 5 బంతులాడి 2 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. నిన్నటి మ్యాచ్ లో 5 బంతులాడి 3 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.
Also Read
- ICC T20I Rankings: జపాన్‌పై విజయం.. మారిన ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్.. టాప్‌లోకి దూసుకెళ్లిన ఇండియా..
- Vallabhaneni Vamsi: స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి.. అసెంబ్లీలో జగన్‌ను సీఎం చేయాలి..
- Sahil Wakode Death: ‘‘నా కొడుకును బెదిరించారు’’.. ప్రొఫెసర్లపై సాహిల్ తండ్రి ఆరోపణ..
- Nara Lokesh: విద్యార్థులను ఆప్యాయంగా పలకరించిన మంత్రి లోకేష్.. మధ్యాహ్న భోజనం నాణ్యతపై ఆరా..
Also Read : CM KCR: నేడు నూతన సచివాలయంలో సీఎం కేసీఆర్ తొలి సమీక్ష
అయితే రోహిత్ శర్మ అవుట్ విషయంలో వివాదం చెలరేగింది. సందీప్ శర్మ బౌలింగ్ లో రోహిత్ శర్మ బౌల్డ్ అయ్యాడు. అయితే ఆఫ్ స్టంప్ కంటే ముందు లెగ్ స్టంప్ పైన బెయిల్ లైట్ రావడంతో సంజూ శాంసన్ గ్లవ్స్ తాకడం వల్లే బెయిల్స్ లేచాయని.. రోహిత్ శర్మ బౌల్డ్ కాలేదని హిట్ మ్యాన్ ఫ్యాన్స్ వాదిస్తున్నారు. అయితే వీడియోలో క్లియర్ గా గమనిస్తే సందీప్ శర్మ వేసి, ఆఫ్ స్టంప్ బెయిల్ ని తాకుతూ వెళ్లింది. ఆఫ్ స్టంప్ బెయిల్ లేచేసరికి లెగ్ స్టంప్ బెయిల్ కదిలి ముందుగా లైట్ వచ్చింది. అదీకాకుండా సంజూ శాంసన్ గ్లవ్స్ కి బెయిల్స్ కి చాలా గ్యాప్ ఉంది. కాబట్టి అతని గ్లవ్స్ తాకి వికెట్లు కదలలేదు.
Also Read : MLA Kannababu: ఎమ్మెల్యేకి నిరసన సెగ.. చేయి చేసుకున్న కన్నబాబు
దీనికి ముందు రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ 62 బంతుల్లో 16 ఫోర్లు, 8 సిక్సర్లతో 124 పరుగుల చేసి అర్షాద్ ఖాన్ వేసిన ఆఖరి ఓవర్ లో అతనికే క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అయితే టీవీ రిప్లైలో బంతి, నడుముపైకి వస్తున్నట్లు క్లియర్ గా కనిపించింది. రూల్స్ ప్రకారం బ్యాటర్ నడుము పైకి వస్తూ.. బెయిల్స్ కంటే పైకి వెళ్లిన బాల్ ని నో బాల్ గా ప్రకటించాలి.. అయితే రోహిత్ శర్మ.. అంపైర్లతో ఏదో మాట్లాడడం ఆ తర్వాత థర్డ్ అంపైర్.. ఆ బాల్ ను కరెక్ట్ బాల్ గా ప్రకటించడం జరిగిపోయాయి. దీంతో యశస్వి జైస్వాల్ అవుట్ అయ్యాడు.

తాజావార్తలు
-
Harish Shankar: అడగకుండానే చెప్పేస్తున్నా.. ఈ బ్యానర్లోనే నా నెక్స్ట్ మూవీ
-
ICC T20I Rankings: జపాన్‌పై విజయం.. మారిన ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్.. టాప్‌లోకి దూసుకెళ్లిన ఇండియా..
-
Vallabhaneni Vamsi: స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి.. అసెంబ్లీలో జగన్‌ను సీఎం చేయాలి..
-
Sahil Wakode Death: ‘‘నా కొడుకును బెదిరించారు’’.. ప్రొఫెసర్లపై సాహిల్ తండ్రి ఆరోపణ..
-
Nara Lokesh: విద్యార్థులను ఆప్యాయంగా పలకరించిన మంత్రి లోకేష్.. మధ్యాహ్న భోజనం నాణ్యతపై ఆరా..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!