CM KCR: సోమవారం మధ్యాహ్నం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తొలి సమీక్ష నిర్వహించనున్నారు. పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ పనులు, కరివెన, ఉదండాపూర్ కాల్వల విస్తరణ పనులు, ఉదండాపూర్ నుంచి తాగునీటి తరలింపు పనులను కేసీఆర్ సమీక్షించనున్నారు. కొడంగల్, వికారాబాద్ వెళ్లే కాల్వల పనులను కూడా కేసీఆర్ సమీక్షించనున్నారు. ఈ సమావేశానికి సంబంధిత మంత్రులు, ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన బీఆర్ అంబేద్కర్ సచివాలయాన్ని ఆదివారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన విషయం తెలిసిందే.
Read also: Heavy Rain : భాగ్యనగరాన్ని ముంచెత్తిన భారీ వర్షం
తెలంగాణ గడ్డపై.. రాజధాని నడిబొడ్డున మరో అద్భుత దృశ్యాన్ని ఆవిష్కరించిన మధుర క్షణాలివి. మధుర ఘట్టమి తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా, పరిపాలనా భవనం దృఢంగా, రాచరికంగా నిలుస్తోంది. తెలంగాణను ప్రపంచం ముందు సగర్వంగా నిలబెట్టాలన్న సీఎం కేసీఆర్ సంకల్పం అకుంతి దీక్షకు మరో కారణం. అత్యాధునిక వసతులతో నిర్మించిన రాష్ట్ర పరిపాలన భవనాన్ని సింహలగ్న ముహూర్తం సందర్భంగా ఆదివారం మధ్యాహ్నం సీఎం కేసీఆర్ ప్రారంభించారు. సచివాలయం ప్రధాన గేటును సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం ఆరో అంతస్తులోని తన ఛాంబర్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ కూర్చున్నారు. ఈ సందర్భంగా కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ పత్రంపై కేసీఆర్ తొలిసారి సంతకం చేశారు. కొలువుదీరిన పలు కీలక పత్రాలపై మంత్రులు తమ ఛాంబర్‌లో సంతకాలు చేశారు.
MLA Kannababu: ఎమ్మెల్యేకి నిరసన సెగ.. చేయి చేసుకున్న కన్నబాబు