CM Revanth: భవనాలు నిర్మించడం సులభమే.. కానీ, కలలకు పునాదులు వేయాలంటే సంకల్పం ఉండాలి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth: తెలంగాణలో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన స్ ప్లాట్‌ఫామ్ వేదికగా ఆయన.. భవనాలు నిర్మించడం సులభమేనని, అయితే విద్యార్థుల కలలకు పునాదులు వేయాలంటే ప్రభుత్వానికి సంకల్పం ఉండాలని అన్నారు. ఆ సంకల్పంతోనే తెలంగాణలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ వేగంగా రూపుదిద్దుకుంటున్నాయని పేర్కొన్నారు.
ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా.. ఆర్థిక, సామాజిక అసమానతలకు ముగింపు పలకడంతో పాటు కులం, మతం, ప్రాంతం, కుటుంబ నేపథ్యం వంటి భేదాలను తొలగించి ప్రతి చిన్నారికి ప్రపంచ స్థాయి విద్యను అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో అత్యాధునిక వసతులతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నట్లు సీఎం తెలిపారు. ఈ విద్యాలయాలు పేద కుటుంబాలకు చెందిన పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు వారి భవిష్యత్తుకు బలమైన పునాదులు వేస్తాయని పేర్కొన్నారు.
Also Read
- Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
- Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
- Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
- Cyclone Arnab: ‘సైక్లోన్ అర్నబ్’ పేరుతో వైరల్.. ఐఎండీ ఏం చెప్పిందంటే..!
ఈ పాఠశాలలు పేద కుటుంబాల పిల్లలను రేపటి శాస్త్రవేత్తలు, పరిపాలకులు, పారిశ్రామికవేత్తలు, నవభారత నిర్మాతలుగా తీర్చిదిద్దే జ్ఞాన మందిరాలుగా నిలవబోతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పేద పిల్లల కలలకు చిరునామాగా, తెలంగాణ మోడల్‌కు ప్రతీకగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిలుస్తాయని సీఎం పేర్కొన్నారు. ఈ పాఠశాలలు కేవలం విద్యను అందించే కేంద్రాలుగా కాకుండా, తరతరాల భవిష్యత్తును మార్చే సంస్థలుగా రూపుదిద్దుకుంటాయని రేవంత్ రెడ్డి తన ట్వీట్లో పేర్కొన్నారు.
భవనాలు నిర్మించడం సులభమే… కానీ కలలకు పునాదులు వేయాలంటే ప్రభుత్వానికి సంకల్పం ఉండాలి.
ఆ సంకల్పంతోనే తెలంగాణలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ వేగంగా రూపుదిద్దుకుంటున్నాయి.
ఆర్థిక, సామాజిక అసమానతలకు ముగింపు పలుకుతూ… కులం, మతం, ప్రాంతం, కుటుంబ నేపథ్యం అనే… pic.twitter.com/m8GCxv7NQD
— Revanth Reddy (@revanth_anumula) August 11, 2026
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!